నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం..
– జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ
మెట్ పల్లి, సెప్టెంబర్ 16(ప్రజా కలం ప్రతినిధి) : నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూ శర్మ అన్నారు. గురువారం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రూ. 15 లక్షల నిధులతో మెట్ పల్లిలో ఏర్పాటు చేసిన నూతన సీసీ కెమెరాలను వారు ప్రారంభించారు. అనంతరం ఎస్పీ సింధూ శర్మ మాట్లాడారు. నేరాలు జరిగిన సందర్భంలో ఆ కేసులను ఛేదించడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు ఎప్పటికప్పుడు సహకరించాలని కోరారు. కాగా రూ. 15 లక్షలతో సిసి కెమెరాలను ఏర్పాటు చేయించిన సింగరేణి సీఎండి శ్రీధర్ కు జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. మెట్ పల్లి డీఎస్పీ గౌస్ బాబా, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు సదాకర్, రాజు నాయక్, రాజా ప్రమిలా, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.