పౌష్టికాహారం తో సంపూర్ణ ఆరోగ్యం…. సిడిపిఓ శంషాబేగం…
ఎటపాక సెప్టెంబర్ 16 (ప్రజాకలం ప్రతినిధి)కూనవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పౌష్టికాహారం మసోత్సవాలు మండల పరిధిలోని నందిగామ గ్రామంలో స్థానిక సర్పంచ్ ఇంగ్లీప్ బేబీ,వైసిపి మండల ప్రెసిడెంట్ తానికొండ వాసు ,సిడిపిఓ శంషాబేగం గురువారం ప్రారంభించారు. అనంతరం నందిగామ లోని అంగన్వాడీ కేంద్రంలోని గర్భిణులు కు శ్రీమంతాలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోషకాహారం పై తల్లులకు అవగాహన, కోవిడ్ నియంత్రణ, రోగ నిరోధక శక్తి పెంపో దింపు, కుటుంబ నియంత్రణ, బిడ్డ పెరుగుదల, అనుబంధ ఆహారం, రక్తహీనత నివారణ, తల్లిపాల ప్రాముఖ్యత, ఆకుకూరల ప్రాధాన్యం, పరిశుభ్రత వాటిపై అవగాహన కల్పించామన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు ప్రభుత్వం మెరుగైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటున్నారని పేర్కొన్నారు.అంగన్వాడీ కేంద్రంలో అందించే పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బాలింతలకు, గర్భిణులు రక్తహీనతనను తగించుకోవచ్చని అన్నారు. పోషక విలువలు అధికంగా ఉండే పాలు, గుడ్లు, పప్పు దినుసులు, తాజా ఆకు కూరలు, పండ్లు, తదితరాల వాటిపై వివరించారు. ముఖ్యంగా గర్భవతులు, బాలింత లు, కిషోర బాలికలు క్రమంతప్పకుండా తీసుకోవాలని తెలిపారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదల కోసం పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సుపర్వైజర్లు వెంకటలక్ష్మి,వెంకట లక్ష్మీ,అంగన్వాడీ టీచర్స్ జింకా రాణి,రాజేశ్వరి, ఆది లక్ష్మీ, మాధవి,లక్ష్మీ,సునీత, కాసులమ్మ,రమాదేవి, నాగమణి పాల్గొన్నారు.
పౌష్టికాహారం తో సంపూర్ణ ఆరోగ్యం…. సిడిపిఓ శంషాబేగం…
RELATED ARTICLES