ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
అపోహలు వీడి వ్యాక్సిన్ తీసుకోవడానికి ధైర్యంగా ముందుకు రావాలి
ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం (ప్రజా కలం)
ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో రావిరాల గ్రామంలో ఏర్పాటు చేసిన కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పల్లెలో ప్రతి గ్రామంలో పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా విధిగా వ్యాక్సినేషన్ తీసుకోవాలని అందరికీ వ్యాక్సిన్ అందించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పని చేస్తున్నారని అన్నారు. అపోహలు వీడి వ్యాక్సిన్ తీసుకోవడానికి ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం రావిరాల లోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ కి వెళ్లి చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా రావిరాల గ్రామానికి చెందిన రమేష్ ముదిరాజ్ కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు 60 వేల రూపాయలు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ కాంటేకర్ మధుమోహన్ వైస్ చైర్మన్ భవాని వెంకట రెడ్డి ఒకటవ వార్డు కౌన్సిలర్ బోధ యాదగిరి రెడ్డి నాలుగో వార్డు కౌన్సిలర్ ఎరుకల కుమార్ గౌడ్ ఐదవ వార్డు కౌన్సిలర్ రాఘనామౌని మౌనిక మహేందర్ ఏడో వార్డ్ కౌన్సిలర్ బూడిద తేజస్విని శ్రీకాంత్ గౌడ్ గారు 11వ వార్డు కౌన్సిలర్ రెడ్డి గళ్ళ సుమన్ గారు కమిషనర్ ఆర్ జ్ఞానేశ్వర్ ఏఈ భార్గవ్ రెడ్డి మరియు లేముర్ ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది మాజీ ప్రజా ప్రతినిధులు బాట సురేష్ జల్లెల లక్ష్మయ్య లింగం సురేష్ ఉప్పునూతల శ్రీనివాస్ లింగం ఆంజనేయులు ముదిరాజ్ గారు నిమ్మ విష్ణువర్ధన్ రెడ్డి పుంటి కూర శేఖర్ రెడ్డి ముత్యాల నాగేశ్వర్ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.