Wednesday, October 20, 2021
Google search engine
Homeక్రైమ్ప్రసూతి కోసం వెళితే ప్రాణం తీశారు..!

ప్రసూతి కోసం వెళితే ప్రాణం తీశారు..!

ప్రసూతి కోసం వెళితే ప్రాణం తీశారు..!
-*వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మృతి అని మృతురాళి బంధువులు,గ్రామస్తుల ఆందోళన
-*జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్,వైద్యుల పై కలెక్టర్ కు ఫిర్యాదు
-*సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించిన జిల్లా కలెక్టర్
-*ఆసుపత్రి సూపరిండెంట్,మత్తు డాక్టర్ కృష్ణారెడ్డి, ప్రసూతి వైద్యురాలు రుక్మిణి లపై పోలీసుకు ఫిర్యాదు
పెద్దపల్లి,సెప్టెంబర్ 15:(ప్రజాకలం ప్రతినధి)
పురిటి నొప్పులతో బాధపడుతూ ప్రసవం కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే,ప్రాణం పోయాల్సిన వైద్యులే ప్రాణం తీశారని మృతురాలు బంధువులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట గురువారం ఆందోళన నిర్వహించారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని,దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన వారికి వైద్యం అందని ద్రాక్ష అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.మృతురాళి బంధువులు,పెద్దబొంకూరు మాజీ ఎంపీటీసీ కారుపాకల సంపత్ వెల్లడించిన వివరాల ప్రకారం పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన మిట్టపల్లి అనూష అనే మహిళ నెలలు నిండడంతో రెండవ కాన్పు కోసం బుధవారం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారని,అన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం సహజ ప్రసూతి కోసం ప్రయత్నం చేద్దామని బుధవారం అర్ధరాత్రి వరకు వేచి చూశారని,రాత్రివేళ మరోక మహిళ ప్రసూతి కోసం రావడంతో హడావుడిగా అనూష కు కూడా అదే రాత్రి ఆపరేషన్ చేసి ప్రసూతి చేస్తామని వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులను బయట నుండి మందులు తీసుకు రావాలని పురమాయించారని, బుధవారం రాత్రి అనూష తో పాటు మరో మహిళకు కూడా ప్రసూతి ఆపరేషన్ నిర్వహించారని,అనూష తో పాటు వెళ్లిన మహిళ డెలివరీతో బయటకు రాగా అనూష రెండు గంటలు అయినా కూడా బయటకు తీసుకు రాలేదని,దీంతో అనూష కుటుంబసభ్యుల్లో ఆందోళన పెరిగి వైద్యులను నిలదీయండంతో అర్ధరాత్రి దాటిన తర్వాత బయటకు వచ్చిన డాక్టర్ అనూషకు ఫిట్స్ వచ్చాయని,వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారని పేర్కోన్నారు. అనూష ను అంబులెన్స్ సహాయంతో కరీంనగర్ హాస్పిటల్ కి తరలించగా అనూష అప్పటికే మృతి చెందినట్టు కరీంనగర్ వైద్యులు నిర్ధారిం చినట్లు తెలిపారు.అనూష జన్మనిచ్చిన బాబు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.మత్తు డాక్టర్ కృష్ణారెడ్డి నిర్లక్ష్యం కారణంగానే ప్రస్తుతి కోసం వెళ్లిన మహిళ అనూష మృత్యువాత పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం పెరిగి పోయిందని,ఇక్కడ వైద్యులు ప్రైవేట్ ఆస్పత్రులు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.ఆస్పత్రికి వెళ్లే రోగులు మందుల కోసం బయట ప్రైవేటు లో కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.సమాచారమందుకున్న పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై కె.రాజేష్ పోలీసు సిబ్బంది పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకొచ్చారు.కాగా,మృతిపట్ల ఆందోళన చేపట్టిన మృతురాళి బంధువులు,గ్రామస్తులు మృతికి కారణ మైన ఆసుపత్రి సూపరిండెంట్, మత్తు డాక్టర్ కృష్ణారెడ్డి,ప్రసూతి వైద్యురాలు రుక్మిణి లను సస్పెండ్ చేసి శిక్షించాలని పోలీసుకు ఫిర్యాదు చేసినట్లు పేర్కోన్నారు. అనతరం జిల్లా కలెక్టరేట్ కు ఫిర్యాదు చేయగా కలెక్టర్ సంగీత సత్యనారాయణ ఈ సంఘటన పై గోదావరిఖని ఎరియా ఆసుపత్రి నుండి ముగ్గురిని నియమించి ప్రత్యేకంగా ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టి రెండు రోజుల్లో నివేధిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. నివేధిక అనంతరం భాద్యులపై చర్యలు చేపడుతామని హామీ ఇవ్వడంతో మృతిరాళి బంధువులు,గ్రామస్తు శాంతించారు.ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో డాక్టర్ చేయాల్సిన పని చేశారని,ఇందులో వైద్యుల తప్పు లేదన్నారు.అనూషకు ఫిట్స్ రావడం వల్లనే మృతి చెందిందని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments