Friday, May 20, 2022
Google search engine
Homeక్రైమ్తెలంగాణలో మరో ఘాతుకం..

తెలంగాణలో మరో ఘాతుకం..

తెలంగాణలో మరో ఘాతుకం..

మహిళపై హత్యాచారం ఆపై హత్య

ఆమనగల్లులో దారుణం

అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసుల అనుమానం

చెన్నంపల్లి గ్రామ శివారులో ఘటన

నిందితులను పట్టుకుంటాం: డీసీపీ ప్రకా‌శ్‌రెడ్డి, ఏసీపీ కుషాల్కర్ వెల్లడి

ఆమనగల్లు (ప్రజా కలం)

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలోని చెన్నంపల్లి గ్రామ శివారులో పారిశుధ్య కార్మికురాలు కొమ్ము పోషమ్మ (38) హత్యకు గురైన సంఘటన బుధవారం వెలుగు చూసింది. మహిళపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు ఆమె శరీరంపై ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతురాలు కాళ్ల మడుమలు నరికి, గొంతు కోసినట్లు అనవాళ్లు ఉన్నాయి. సంఘటన స్థలంలోనే ఆమె ధరించిన చీర, లోదుస్తులు, మద్యం సీసాలు పడి ఉండటంతో పక్కా ప్లాన్‌తోనే మహిళను అత్యాచారం, హత్యచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

గ్రామానికి చెందిన జంతుక మహేష్‌ గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామునా బహిర్భూమికి వెళ్లడంతో మహిళ మృతి చెంది ఉండటాన్ని చూసి విషయన్ని గ్రామ సర్పంచ్‌ శ్రీనయ్య దృష్టికి తీసుకేళ్లాడు. సర్పంచ్‌ సీఐ ఉపేందర్‌కు సమాచారం అందజేశారు. దీంతో సీఐ ఉపేందర్‌, ఎస్సై ధర్మేశ్‌ సంఘటన స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పరిశీలించి చంద్రాయిన్‌పల్లికి చెందిన కొమ్ము పోషమ్మగా గుర్తించి బాధిత కుటుంబానికి సమాచారం అందజేశారు. హత్య కేసును చేదించేందుకు క్లూ స్టీం, డాగ్‌స్కాడ్‌లను పోలీసులు రంగంలోకి దింపారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని ముర్తుజపల్లికి చెందిన కొమ్ము గాలయ్య, పోషమ్మలు స్వగ్రామంలో బతుకుదేరువులేక కొంతకాలంగా పోషమ్మతల్లిగారి ఇళ్లు మాడ్గుల మండలంలోని చంద్రాయిన్‌పల్లి గ్రామంలో భర్త పిల్లలతో కలిసి జీవనం కొనసాగిస్తుంది. భర్త గ్రామంలోనే కూలీ పనులకు వేళ్తుండగా పోచమ్మ హైదరాబాద్‌లోని గోషామహాల్‌ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికు రాలిగా పని చేస్తుంది.

చంద్రాయిన్‌పల్లి నుంచి ప్రతీరోజు హైదరాబాద్‌కు వేళ్లి విధులు నిర్వహించి రాత్రి ఇంటికి వచ్చేది. రోజువారి విధంగానే పనులు ముగించుకొని వచ్చి చెన్నంపల్లి శివారులో పెరుమళ్ల కృష్ణారెడ్డి పొలంలో హత్యకు గురైంది. హత్య చేసిన నిందితులను త్వరలోనే పట్టుకొని కేసును చేదిస్తామని శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి, ఏసీపీ కుషాల్కర్‌ పేర్కొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments