డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తో ముంబైకర్ల భేటి !
హైదరాబాద్: సెప్టెంబర్ 16( ప్రజా కలం ప్రతినిధి)
హైదరాబాద్ విజయనగర్ లోని స్వేరో కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కో-ర్డినేటర్ డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తో ముంబై రిజియన్ ప్రాతినిధులు బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు భేటీ అయ్యారు. ఇందులో వివిధ సంఘాల ప్రముఖులైన వేముల సత్యనారాయణ పద్మశాలి (భివండి), కాట వెంకటరెడ్డి, సిరిపంగి రవీందర్ మహారాజ్, సుక్క నర్సింహా మహారాజ్, మూగ ప్రభాకర్ మాల, చింతకింది గణేష్ ముదిరాజ్, గ్యారా శేఖర్ మహారాజ్, విష్ణు పెండ్యాల, దుబ్బాక జగదీశ్వర్, అంగుళి మాల (నిజమాబాద్), బహుజన మేధావి ప్రొఫెసర్ మాలిక్ సార్ (హైదరాబాద్), మూల్ నివాసి మాల తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముంబై వలసజీవుల కోరిక మేరకు ప్రవీణ్ కుమార్ ముంబై మహానగరానికి రావాలని, ఏర్పాటు చేయబోయే సభకు ఓ తేదీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇట్టి దానికి ప్రవీణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. వలసజీవులు, కూలినాలి బిడ్డలు సర్వోన్నత విద్యను పొందడానికి, విదేశాల్లో విద్య ఉద్యోగాలు, పారిశ్రామిక వేత్తలుగా మారడం కోసమే తమ బహుజనుల లక్ష్యమై ఉండాలని హితబోధ చేశారు. తెలంగాణ గడ్డపై నీలి జండా ఏగుర వేయ్యడానికి సామాజిక వర్గాలన్ని కల్సి సమిష్టిగా కృషి చేద్దామని పిలుపు నిచ్చారు. చివరిలో దేశవ్యాప్తంగా ఫూలే అంబేడ్కరిజం రుతువు కొనసాగుతుందని ప్రవీణ్ కుమార్ తెల్పారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.