Saturday, May 21, 2022
Google search engine
Homeతెల౦గాణ‌దళిత గిరిజన దండోరా విజయవంతం

దళిత గిరిజన దండోరా విజయవంతం

దళిత గిరిజన దండోరా విజయవంతం

గజ్వేల్:17 సెప్టెంబర్ (ప్రజా కలం ప్రతినిధి)

గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో కూడా స్థానిక ఐఓసి కార్యాలయం వెనక గల మైదానంలో ఏర్పాటు చేసిన దళిత గిరిజన దండోరా కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి గర్జించారు.తన మాటలతో టీఆర్‌ఎస్ నేతలను దుమ్ముదులిపేశారు.‘దమ్ముంటే గజ్వేల్‌కు రావాలని టీఆర్‌ఎస్ నేతలు సవాల్ విసిరారు.ఇసుకవేస్తే రాలనంత జనం గజ్వేల్ సభకు పోటెత్తారు.ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ అధికారులకు చెబుతున్నా.మా తలకాయలు లెక్కపెట్టండి.ఒక్క తల తక్కువ ఉన్నా. మళ్లీ ఆరు నెలల్లో ఇదే గడ్డ మీద కదం తోక్కుతాం.
అప్పుడు 5 లక్షల మంది వస్తాం.కేసీఆర్ గుర్తు పెట్టుకో’ అని రేవంత్ హెచ్చరించారు.ఇవాళ తెలంగాణ గడ్డకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని, స్వయంపాలన కోసం నాడు రజాకార్లను తరిమికొట్టారన్నారు.గజ్వేల్ అంటే నాకు ప్రత్యేక అభిమానముందని తెలిపారు.కొండపోచమ్మ ప్రాజెక్టు కింద 14 గ్రామాలను నట్టే ముంచారని,14 గ్రామాల ప్రజలకు నిలువ నీడ లేకుండా చేశారని ఆరోపించారు.1980లో మెదక్ నుంచే ఇందిరాగాంధీ గెలిచారని, ఇందిరాగాంధీ మెదక్ జిల్లాలో 25 పెద్దతరహా పరిశ్రమలు పెట్టించారని చెప్పారు.తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాదేనని, రాష్ట్రం వచ్చాక కాంగ్రెస్ కు కేసీఆర్ వెన్నుపోటు పోడిచారని రేవంత్ విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో ఇస్తే 12 శాతం ఇస్తా అని కేసీఆర్ చెప్పి ఏడేళ్లు గడుస్తున్నా.ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అన్నారు.
జనాభా ప్రాతిపదికన కింద నిధులకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తే దానిని పక్కన పెట్టి లక్ష కోట్లు పక్కదారి పట్టించిండు.కుటుంబాలు చిదిమడానికి, కుటుంబం ఆర్థికంగా దెబ్బతినడానికి తాగుడం వల్లకాదా అని అన్నారు.రూ.36 వేల కోట్లు తీసుకుంటున్న,కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదా ఆలోచించండి. 3.5 కోట్లు ఉన్న జనాభా 4 కోట్లు అయ్యింది కానీ తాగుబోతులను 3 రేట్లు పెంచిండు.
సినిమా వాళ్లతో తిరిగిన కేటీఆర్ ఈడీ కేసులో తప్పించేందుకు ప్రయత్నిస్తుండు.తండ్రి తాగుబోతులకు. కొడుకు డ్రగ్ తీసుకునేవాళ్లకు అంబాసిడర్ గా మారారు.వ్యాపారం కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారా అని ప్రశ్నించారు. 9,10 తరగుతుల పిల్లలు గంజాయి,డ్రగ్స్ తీసుకుంటున్నారు ఓ సారి ఆలోచించు కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు.నాలుగుకోట్ల ప్రజల విముక్తి కోసం,పార్టీ ప్రయోజనాల కోసం ఆలోచించకుండా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు.సీఎం కేసీఆర్‌ను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు పశ్చాత్తాపంగా మెదక్ జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను గెలిపించండి. 12 శాతం ఉన్న మాదిగలకు మంత్రి పదవిని ఇవ్వలేదు ఆలోచించండి.కెసిఆర్ కు నిజంగా దళితులపై అభిమానం ఉంటే మీ ఇంట్లో ఉన్న ఓ మంత్రి పదవిని తీసేసి మాదిగ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వండి.ఈ 40 రోజుల్లో మారుమూల గ్రామాల దళిత, గిరిజనులను తెలంగాణ వస్తే ఏం వచ్చిందని అడగితే.మా పిల్లల చావులొచ్చినయ్, మా బతుకులు చితికిపోయినయ్,పోడు భూములను హరితహారం పేరిట లాక్కున్నరు అన్నారు.కేసీఆర్ మనవడు చదువుకుంటున్న స్కూల్‌లో దళితుల పిల్లలు చదివి దేశాన్ని ఏలాలనుకుంటున్నారు.గొర్రెలు, బర్రెలు మాకెందుకు. మాకు చదువులు, ఉద్యోగాలు కావాలి. పేదలకోసం ఆరోగ్య శ్రీ తెస్తే కరోనాని దానిలో చేర్చకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఆరోగ్య శ్రీని రూ.5 లక్షలకు పెంచాలి. ఏ రోగమొచ్చిన కార్పొరేట్ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం అందించాలి. కేజీ టూ పీజీ అని చెప్పి వదిలేసిండు.దళితులు గిరిజనుల పిల్లలను చదువు నుంచి దూరం చేసే విధంగా తాండాల్లో 4632 బడులను బంద్ చేసి విద్యను దూరం చేసిండు అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.ఈ కార్యక్రమంలోమల్లికార్జున్ కారగే, మాజీ మంత్రి గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ,భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, హనుమంతరావు,మాణిక్యం ఠాకూర్ మధుయాష్కి, విహెచ్ పొన్నాల లక్ష్మయ్య, తుంకుంట నర్సారెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు,జగ్గారెడ్డి సురేష్ షెట్కార్, శ్రావణ్ రెడ్డి,తదితర సీనియర్ కాంగ్రెస్ నాయకులు, నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments