నిజమైన తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
పోచంపల్లి సెప్టెంబర్ 17 ప్రజా కలం ప్రతినిధి…✍️
నిజమైన తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. శుక్రవారం రోజున తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో కార్యక్రమం పల్లి గ్రామంలో ప్రారంభించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వారు హాజరై మాట్లాడుతూ పేద ప్రజల కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన కమ్యూనిస్టులు అన్నారు. పేద ప్రజలకు సాయుధ పోరాటాల ద్వారా 10 లక్షల భూమిని పంచిపెట్టారని ప్రజల పక్షాన నిలబడి నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడి నాలుగు వేల మంది కమ్యూనిస్టు వీర మరణం పొందారు వారు నిజమైన కమ్యూనిస్టులు కానీ బూర్జువా పార్టీలు ఏ పోరాటం పాలలో పాల్గొనకుండా మేమే నిజమైన వారసులం అని చెప్పుకుంటున్నారు అని అన్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిజాం సర్కారు వలె వ్యవహరిస్తున్నాయి అని అన్నారు. జిల్లా కార్యదర్శి జహంగీర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం అందిపుచ్చుకొని నేటి యువత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా, విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడం కోసం ముందుకు రావాలి అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ,జిల్లా కార్యవర్గం సభ్యులు కల్లూరి మల్లేష్, బాల్ రాజు, అనురాధ, పార్టీ సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, మండల కార్యదర్శి పగిళ్ల లింగారెడ్డి, శాఖ కార్యదర్శి మార్తా సత్యనారాయణ మండల కమిటీ సభ్యులు మంచాల మధు, బుచ్చి రెడ్డి, జ్యోతి ,విష్ణు ,సభ్యులు బిక్షపతి అంజయ్య, యాదయ్య పాల్గొన్నారు.