నూతనకల్లులో భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ పొంగులేటి..
టిఆర్ఎస్ నాయకులు గణేశుల రవి ఆధ్వర్యంలో ఘన స్వాగతం..
కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం..
తల్లాడ సెప్టెంబర్ 17( ప్రజా కాలం న్యూస్) :
తల్లాడ మండలంలోని నూతనకకల్లు గ్రామంలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ ల శ్రీనివాసరావు ఆవరణలో వినాయక విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. గణేష్ ల నరసింహారావు దంపతులు, కొమ్మినేని కృష్ణయ్య దంపతులు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. తొలుత మాజీ ఎంపీ పొంగులేటికి గ్రామానికి చెందిన స్థానిక నేత గణేశుల రవి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాలతో టపాసులు పేలుస్తూ ఘన స్వాగతం పలికారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారులు, పెద్దలు, మహిళలు నూతన వస్త్రాలు ధరించి కోలాటం ఆడుతూ ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. అనంతరం పొంగులేటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మాట్లాడారు. విగ్నేశ్వరుడు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం పొంగులేటి శాలువాలు పూలమాలతో సన్మానించారు సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, జిల్లా నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి, పాశంగులపాటి లక్ష్మీనారాయణ, గణేశుల రవి, దుండేటి వీరారెడ్డి, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, సర్పంచులు మాగంటి కృష్ణయ్య, బండారు ఏడుకొండలు, మాజీ జడ్పిటిసి మూకర ప్రసాదు, నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు (కె.వి), పొట్టేటి బ్రహ్మారెడ్డి, ఏర్రి నరసింహారావు, తుమ్మలపల్లి రమేష్, పొన్నం కృష్ణయ్య, మారెళ్ళ మల్లికార్జున రావు, గోవిందు శ్రీనివాసరావు, గూడూరు రామకృష్ణ తూము వెంకటనారాయణ, విగ్రహ దాత తోట రామారావు, వరికొల్లి రమేష్, మీర్జా మైబు, మాజీ సర్పంచులు విలాసారపు రాములు, నరసింహారావు, వెంకన్న, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.