Wednesday, October 20, 2021
Google search engine
Homeతెల౦గాణ‌ప్రజాస్వామ్యంలో  శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా..?

ప్రజాస్వామ్యంలో  శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా..?

ప్రజాస్వామ్యంలో  శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా..?

దొరల గడీల రాజ్యంలో సమస్యలు చెప్పుకునే అవకాశం లేదా…?
మంత్రి రాజీనామా చేస్తేనే మహేశ్వరం అభివృద్ధి
అక్రమ  అరెస్టులు చేయడం పట్ల భగ్గుమన్న కాంగ్రెస్ నాయకులు
మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి
మహేశ్వరం (ప్రజా కలం)
దొరల గడీల రాజ్యంలో సమస్యలు చెప్పుకునే అవకాశం లేదా…? అని
మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షుడు నందిగామ నర్శింహ్మా, రాష్ట్ర ఎస్సి సెల్ కన్వీనర్ బండి మధుసూదన్ రావు  ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి క్యాంపు కార్యాలయానికి వెళ్లి వారికి వినతి పత్రం సమర్పించడానికి శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో వెళుతుంటే పోలీసులు అక్రమ అరెస్టు చేసి పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు తరలించారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు అయిన వారిలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు దేప భాస్కర్ రెడ్డి ఏనుగు జంగారెడ్డి, చిలుక ఉపేందర్ రెడ్డి ఉన్నారు.
ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పరిపాలన నడుస్తుంది. మేము మా నియోజకవర్గం లో దళిత గిరిజనుల కోసం మా స్థానిక ఎమ్మెల్యే ని కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా వెళుతుంటే మమ్ముల్ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామ్యం  అన్నారు. ఈ దొరల గడీల రాజ్యంలో సమస్యలను చెప్పుకునే అవకాశం కూడా లేదా అని ప్రశ్నించారు. మహేశ్వరం నియోజకవర్గం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మంత్రి ని అడుగడుగునా అడ్డుకుంటాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ కార్పోరేషన్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వంగెటి ప్రభాకర్ రెడ్డి మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకి ఈశ్వర్,
మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షులు అల్లే కుమార్ మధుసూదన్ నరసింహ చాకి జాన్ రాజేందర్ రఘుపతి భాస్కర్ ప్రసాద్ ప్రవీణ్ శ్రీకాంత్
మీర్ పేట్, బడంగ్ పేట్ కార్పోరేషన్ అధ్యక్షులు సామిడి గోపాల్ రెడ్డి, పెద్దబావి వెంకట్ రెడ్డి, బంగారి బాబు, జంగయ్య, బొక్క భూపాల్ రెడ్డి పురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత, నల్లెంకి ధనరాజ్ గౌడ్, జంపన్న యాదవ్, ఢిల్లీ శ్రీధర్, అల్లే కుమార్, చేంపంగి ప్రవీణ్, మహ్మద్ బిన్ సిద్ధిక్, రమేష్ నేత, జాన్, అప్జల్ బెగ్, రఘుపతి, ఒమర్, ప్రసాద్, రాజు, మస్న రవి కుమార్, రంజిత్, సంతోష్, రుప్లా
నాయక్, శ్రీకాంత్, మహేష్, వినోద్ చారి, మధన్ పాల్, సత్తి, కళ్యాణ్, పురుషోత్తం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments