వేతనం కోసం ప్రతినెల ఉపాధ్యాయుల ఎదురుచూపులు
ప్రతి నెల ఒకటో తేదీన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలి
సప్లిమెంటరీ బిల్లుల నిధుల విడుదలలో జాప్యాన్ని నివారించాలి
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్
మహేశ్వరం (ప్రజా కలం)
ఉపాధ్యాయులు ప్రతి నెల జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర
కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మహేశ్వరంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు,
విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు దశలవారీగా ఒక్కోరోజు
కొన్ని జిల్లాల చొప్పున విడుదలౌతున్నాయని వేతనం కోసం ప్రతినెలా ఎదురు చూడాల్సిన
పరిస్థితి ఏర్పడింది. ఇఎంఐ లు సకాలంలో చెల్లించలేక పెనాల్టీ కట్టాల్సి వస్తున్నదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.ఉద్యోగులు ఉపాధ్యాయుల వేతనాలను, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లను నెల మొదటి తేదీనే
విడుదల చేయాలని
సప్లిమెంటరీ క్లైముల నిధుల విడుదలకు నిర్దిష్టమైన సమయాన్ని నిర్దేశించాలి.
సప్లిమెంటరీ క్లైములను
టోకెన్ నంబరు, సమర్పించిన తేదీల వరుస క్రమంలో
పారదర్శకంగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి భగవంతు రాజ్ జిల్లా ఆడిట్ కమిటీ మెంబర్ బీ రాములయ్య మహేశ్వరం అధ్యక్షులు బి బుగ్గ రాములు మహేశ్వరం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తలకొండపల్లి ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు కందుకూరు ప్రధాన కార్యదర్శి బుగ్గ రాములు మహేశ్వరం సీనియర్ నాయకులు సరస్వతి హనుమాన్ దాస్ జంగయ్య సీతారాం సతీష్ కుమార్ శ్రీనివాస్ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వేతనం కోసం ప్రతినెల ఉపాధ్యాయుల ఎదురుచూపులు
RELATED ARTICLES