Saturday, May 21, 2022
Google search engine
Homeస్పెషల్ స్టోరీస్19న నిమజ్జన (శోభాయాత్ర) ఏర్పాట్లు

19న నిమజ్జన (శోభాయాత్ర) ఏర్పాట్లు

19న నిమజ్జన (శోభాయాత్ర) ఏర్పాట్లు
గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాలలో, శోభాయాత్ర నిర్వహించే రహదారులలో పారిశుధ్య నిర్వహణకు జీహెచ్‌ఎంసీ నుంచి 8,116 మంది సిబ్బందితో శానిటరీ సూపర్‌వైజర్‌ లేదా ఎస్‌ఎఫ్‌ఏల ఆధ్వర్యంలో 215 ప్రత్యేక బృందాలను నియమించారు.
ప్రతి 3-4 కి.మీ.లకు మూడు షిఫ్టుల్లో గణేష్‌ యాక్షన్‌ టీమ్‌లు విధులు నిర్వర్తించనున్నాయి.
హెచ్‌ఎండీఏ – జీహెచ్‌ఎంసీ సమన్వయంతో నిమజ్జన వ్యర్థాల తొలగింపు పనులు చేపట్టనున్నారు. ఎన్టీఆర్‌ మార్గ్‌, హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో విగ్రహాలు, పూలు, పత్రి ఇతర చెత్తా చెదారాన్ని తొలగించేందుకు హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ యంత్రాంగం 1000మంది లేబర్స్‌, సూపర్‌వైజర్‌ స్టాఫ్‌ను నియమించారు.
శోభాయాత్ర జరిగే ప్రాంతాలలో భక్తుల సౌకర్యార్థం జలమండలి 101 క్యాంపులను ఏర్పాటు చేయనుంది.
అగ్నిమాపక శాఖ నుంచి 38 అగ్నిమాపక యంత్రాలను సమకూర్చారు.
సరూర్‌నగర్‌, కాప్రా, ప్రగతి నగర్‌ చెరువుల వద్ద మూడు ప్రత్యేక బోట్ల ఏర్పాటు
శోభాయాత్రకు ఆటంకం లేకుండా ఆయా రూట్లలో అర్భన్‌ బయో డైవర్శిటీ విభాగం వారు చెట్ల కొమ్మలను తొలగించనున్నారు. సర్కిల్‌కు ఇద్దరు చొప్పున నిరంతరం ప్రత్యేక సిబ్బంది అందుబాటులో ఉంటారు.
హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో డబుల్‌ లేయర్‌ భారీగేట్లు, నిరంతర పర్యవేక్షణకు కంట్రోల్‌ రూంలను ఆర్‌ అండ్‌ బీ శాఖ వారు ఏర్పాటు చేయనున్నారు.
గణనాథుల తరలింపునకు రవాణాశాఖ అధికారులు 1000 వాహనాలను భాగ్యనగర గణేష్‌ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సమకూర్చుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments