20న కలెక్టరేట్ ఎదుట ధర్నా ను విజయవంతం చేయాలి
టీడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు తన్నీరు శ్రీనివాస్
*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజా కలం
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన జర్నలిస్ట్స్ డిమాండ్ డే సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు తన్నీరు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలికంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు, ఇల్లు లేదా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో టీడబ్ల్యూజెఎఫ్ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు అందరూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.