బాలాపూర్ గణేష్ ని వద్ద ప్రత్యేక పూజలు
బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ చీఫ్ కో ఆర్డినేటర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
బాలాపూర్ (ప్రజా కలం)
బాలాపూర్ గణేష్ ని దర్శించుకున్న బహుజన్ సమాజ్ పార్టీ
తెలంగాణ చీఫ్ కో ఆర్డినేటర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తారతమ్యాలు కుల మత భేదాలు లేకుండా గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని బాలాపూర్ గణేష్ దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇబ్రాహీం శేఖర్ బిఎంసి డిప్యూటీ మేయర్
బిఎస్పి పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జి
గుడ్ల శ్రీనివాస్ మహారాజ్
గ్రామ ప్రజలు బిఎస్పి నాయకులు ,కార్యకర్తలు
బాలాపూర్ బడంగ్ పేట్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.