బాచుపల్లి విఘ్నేశ్వరుడిడిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కార్పొరేటర్ ఆగం పాండు
*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజా కలం సెప్టెంబర్ *
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో ఏర్పాటు చేసిన మహాగణపతి శుక్రవారం సాయంత్రం 16వ డివిజన్ కార్పొరేటర్, టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని ఆ స్వామివారిని ప్రార్థించినట్లు కార్పొరేటర్ ఆగం పాండు తెలిపారు. బాచుపల్లిలో ప్రతియేటా మహాగణపతికి నవరాత్రులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించడం తనకెంతో సంతోషంగా ఉందని, స్వామివారిని భక్తి శ్రద్ధలతో భక్తులు పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని కార్పొరేటర్ ఆగం పాండు పేర్కొన్నారు.