వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి
హత్యే అంటున్న కుటుంబ సభ్యులు
డాగ్ స్కాడ్,క్లూస్ టీమ్ తో మృత దేహాన్ని, మృతురాలు ఇంటి పరిసర ప్రాంతాన్ని పరిశీలించిన
సీఐ మధుసూదన్,ఎస్ ఐ శ్రీనివాస్ రెడ్డి
మహేశ్వరం (ప్రజా కలం)
మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘట్టుపల్లి గ్రామంలో అనుమానస్పదస్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.ఇబ్రహీంపట్నం ఏసీ పీ బాలకృష్ణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… మహేశ్వరం మండలం ఘట్టుపల్లి గ్రామానికి చెందిన ఆసియా బేగం (35) తన ఇంట్లో అనుమానస్పద స్థితిలో మృతి చెందడంతో శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఆసియా కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి సీఐ మధుసూదన్,ఎస్ ఐ శ్రీనివాస్ రెడ్డి చేరుకొని డాగ్ స్కాడ్,క్లూస్ టీమ్ తో మృత దేహాన్ని, మృతురాలు ఇంటి పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు.శుక్రవారం సాయంత్రం ఆసియా బేగం కుమారులు ఇఫ్రాన్, అప్రోస్ స్కూల్ నుంచి సాయంత్రం 4 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి,ఇంటి మెయిన్ డోర్ తలుపు మూసివేసి(దగ్గర వేసి) ఉండంతో,లోపలికి వెళ్లి చూడగా తల్లి ఆసియా బేగం(35)నేలపై పడిపోయి ఉండడంతో ప్రక్కనే ఉన్న పిన్ని(చినమ్మ)వాళ్లకు సమాచారం అందించాడు.వాళ్ళు వచ్చి చూసే సరికి ఆసియా బేగం మృతి చెంది ఉంది. ఈ విషయం పై ఆసియా భర్త గౌస్ కు సమాచారం అందించారు. మృతరాలు(ఆసియా) గొంతుకు చున్ని లాంటిది చూట్టి ఉందాన్ని, తలకు గాయమైనట్లు పోలీసులు తెలిపారు.ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గొంతు నులిమి చంపి నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఆసియా భర్త గౌస్ దినసరి కూలీ,రోజులాగే కూలిపనికి ఆమనగల్ కు వెళ్ళాడన్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.