Wednesday, October 20, 2021
Google search engine
Homeక్రైమ్ఇంత నిర్లక్ష్యమా...?

ఇంత నిర్లక్ష్యమా…?

మహేశ్వరం లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై మరి ఇంత నిర్లక్ష్యమా…?

మహేశ్వరం చెరువు వద్ద  గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఏర్పాట్లు చేయని వైనం

అధికారుల సర్పంచ్  నిర్లక్ష్యానికి నిదర్శనం

చీకట్లో గణేష్ నిమజ్జనం చేయడానికి వచ్చిన వారికి ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు

మహేశ్వరం బీజేవైఎం అధ్యక్షులు వనంపల్లి శ్రవణ్

మహేశ్వరం (ప్రజా కలం)

మహేశ్వరం లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై మరి ఇంత నిర్లక్ష్యమా…?  ఎందుకు చేస్తున్నారని
మహేశ్వరం బీజేవైఎం అధ్యక్షులు వనంపల్లి శ్రవణ్  ప్రశ్నించారు. మహేశ్వరం చెరువు వద్ద  గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఏర్పాట్లు  ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మహేశ్వరం చెరువు కేసి తండా సర్పంచ్ పరిధిలో కి వస్తుందని  ఆయన మహేశ్వరం సర్పంచ్  మీరే చేయాలని ఈయన  ఒకరిమీద ఒకరు వేసుకొని  అసలు మహేశ్వరం చెరువు వద్ద గణేష్ నిమజ్జనం చేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయని  శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అధికారులు చోద్యం చూశారు తప్ప ఏర్పాట్లపై ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు. మహేశ్వరం గ్రామ సెక్రెటరీ ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదని సమాధానం కూడా చెప్పలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హిందువుల పండుగ పై ఎందుకు వివక్ష చూపుతున్నారని శ్రవణ్ ప్రశ్నించారు. భారీ ఎత్తున గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఎందుకు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించారని ప్రశ్నించారు. మహేశ్వరం చెరువు వద్ద కనీసం లైట్లు కూడా ఏర్పాటు చేయాలని చీకట్లో గణేష్ నిమజ్జనం ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఎవరి ఇష్టానుసారం వారు వివరిస్తే ప్రజల కష్టాలు ఎవరు పట్టించుకోవాలని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.చీకట్లో గణేష్ నిమజ్జనం చేయడానికి వచ్చిన వారికి ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అని ఆయన ప్రశ్నించారు.
నిర్లక్ష్యం వహించిన అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments