Wednesday, October 20, 2021
Google search engine
Homeస్పోర్ట్స్ఐపీఎల్-2021 ప్రారంభం

ఐపీఎల్-2021 ప్రారంభం

హైదరాబాద్: మళ్లీ పొట్టి క్రికెట్ సందడి మొదలు కాబోతోంది. అసలు సిసలైన క్రికెట్ వినోదం అభిమానులను ఉర్రూతలూగించబోతోంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్ రెండో భాగం.. నేటి నుంచి యూఏఈ వేదికగా కొనసాగనుంది. ఇవాళ్టి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. గత ఏడాది కూడా యూఏఈలో ఐపీఎల్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అవే దుబాయ్, అబుదాబి, షార్జా క్రికెట్ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్-2021 రెండో భాగంలో.. 27 రోజుల్లో మొత్తం 31 మ్యాచ్‌లు జరుగుతాయి. అక్టోబరు 8న లీగ్ స్టేజ్‌లో చివరి మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆర్సీబీ ఢీకొడుతుంది. మొదటి క్వాలిఫైయర్-1 మ్యాచ్ అక్టోబరు 10న దుబాయ్‌లో జరుగుతుంది. ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లు షార్జా వేదికగా అక్టోబరు 11, అక్టోబరు 13న నిర్వహిస్తారు.
ఇవాళ దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియం వేదికగా ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. రాత్రి 07.30కి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మొదటి మ్యాచ్‌లోనే రెండు బలమైన జట్లు పోటీపడుతుండడంతో అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. ఈసారి స్టేడియంలోకి ప్రేక్షకులను కూడా అనుమతిస్తున్నారు. ఐతే మరీ ఎక్కువ మంది కాకుండా.. పరిమిత సంఖ్యలోనే స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తారు. స్టేడియంలో ప్రేక్షకుల సందడి ఈ సీజన్‌కు మరింత కిక్కు ఇస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments