Tuesday, October 19, 2021
Google search engine
Homeతెల౦గాణ‌కాంగ్రెస్ నాయకులకు గజ్వేల్ అభివృద్ధి కావడం లేదా?

కాంగ్రెస్ నాయకులకు గజ్వేల్ అభివృద్ధి కావడం లేదా?

కాంగ్రెస్ నాయకులకు గజ్వేల్ అభివృద్ధి కావడం లేదా?
గజ్వేల్:(ప్రజా కలం ప్రతినిధి)

గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూమిరెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ జరిపిన సభ పూర్తిగా ఫ్లాప్ అయిందని మూడు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు వాళ్లు 30 వేలమంది కూడా రాలేదని,మరొక విషయం కెసిఆర్ గారిని చిన్న చూపు చేసి మాట్లాడడం పద్ధతి కాదని బేషరతుగా క్షమాపణ చెప్పాలని, అలాగే గీతా రెడ్డి కూడా కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని,ఆమె కూడా క్షమాపణ చెప్పాలని,గజ్వేల్ అభివృద్ధి చేయలేదని సభలో అన్నారు కానీ గజ్వేల్ అభివృద్ధి ఎలా జరిగిందో వచ్చిన ప్రజలందరూ కూడా చూశారని నేడు రైతుబంధు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తీసుకోవడం లేదా పెన్షన్లు తీసుకోవడం లేదా పార్టీలకతీతంగా మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ పథకాలను తీసుకువచ్చి ఇంటింటికి మంచినీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్,జరిగిన సభలో గజ్వేల్ నియోజకవర్గం నుంచి అసలు కార్యకర్తలు రాలేదని అసలు లేరని వేరే ఇతర నియోజకవర్గాల నుండి కార్యకర్తలను తీసుకువచ్చి గజ్వేల్ లో సభకు అని కెసిఆర్ లాగా మాట్లాడితే కెసిఆర్ కాలేరని కాబట్టి మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంకా ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని సమావేశాలు పెట్టినా మళ్ళి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాసరి అమరావతి,జడ్పిటిసి పంగ మల్లేశం, మండల అధ్యక్షుడు బెండే మధు,పాల రమేష్ గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి, సర్పంచులు మరియు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments