–మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేములవాడ, ప్రజా కలం ప్రతినిధి, : నేటి సమాజంలో బాలికలు తమ ఆత్మరక్షణ కోసం తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందాలని వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవిరాజు అన్నారు.శనివారం ఓకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 50 మంది విద్యార్థులకు బెల్టులతో పాటు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా విద్యార్థినిలు కరాటే విద్యను నేర్చుకోవాలన్నారు.భవిష్యత్ లో జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాణించి వేములవాడకు మంచి గుర్తింపు తీసుకురావాలని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.తదనంతరం కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాసరావు,సిరిగిరి చందు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీర్ మహమ్మద్ మాట్లాడుతూ కరాటే విద్య నేర్చుకోవడం ద్వారా శారీరకంగా,మానసికంగా ఎంతో దృఢత్వం అలపడుతుందన్నారు.ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలను దృష్టిలో ఉంచుకొని మహిళలు తప్పకుండా కరాటే నేర్చుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ ఎంఏ మన్నాన్,బిజెపి నాయకులు అంజిబాబు,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.