సర్దార్ పటేల్ గణనాధుని వద్ద 2 11 100 రూపాయలకు వేలం పాటలో లడ్డూను దక్కించుకున్న జల్లెల రామ స్వామి
పట్టు పంచను తీసుకున్నా పాల్వాయి సత్యనారాయణ
మహేశ్వరం (ప్రజా కలం ప్రతినిధి)
గణేష్ ఉత్సవాల్లో భాగంగా మహేశ్వరం మండల కేంద్రం తుక్కుగుడ మున్సిపల్ పరిధిలో రావిర్యాల గ్రామంలో సర్దార్ పటేల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాధుని లడ్డు వేలం పాట శనివారం రాత్రి నిర్వహించగా లడ్డూ ని దక్కించుకోడానికి పలువురు వేలంపాటలో పోటీపడ్డారు. చివరకు జల్లెల రామ స్వామి అధికంగా వేలంపాట వేసి ని 2 11 100రూపాయలకు లడ్డును దక్కించుకున్నాడు. గణేష్ స్వామి వారి పట్టు పంచ కు పోటీ పలువురు పోటీ పడి చివరకు పట్టు పంచను తీసుకున్నా పాల్వాయి సత్యనారాయణ తీసుకున్నారు. ఇక్కడ స్వామి వారి దగ్గర లడ్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి అనుకున్న కోరికలు నెరవేరాలని ప్రతి ఒక్కరు తమ కోరికలు తీరుతాయని నమ్మకంతో అడ్డుకోవడానికి ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఆసక్తి చూపుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్దార్ పటేల్ యూత్ అధ్యక్షులు స్వీయోదన్ మాజీ అధ్యక్షులు వెంకటాచారి తుక్కుగూడ మున్సిపల్ కౌన్సిలర్ ఎరుకల శివ కుమార్ గౌడ్
లింగం తిరుమలేష్ విజయ్ కుమార్సర్దార్ పటేల్ యూత్ సభ్యులు గ్రామ ప్రజలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.