హుస్సేన్ సాగర్ వైపు పంచముఖ రుద్ర మహాగణపతి
హైదరాబాద్: హుస్సేన్ సాగర్ వైపు ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహాగణపతి శభాయాత్ర ప్రారంభమయింది. తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న కాళనాగేశ్వరి, శ్రీకృష్ణకాళ సమేతంగా ఖైరతాబాద్ మహాగణపతిని ప్రత్యేక ట్రాలీలో ఎక్కించారు. హుస్సేన్ సాగర్ వైపు నెమ్మదిగా కదులుతున్న మహాగణపతి శోభాయాత్ర కదులుతుంది. 2.5 కిలోమీటర్లు సాగనున్న ఖైరతాబాద్ మహా గణేశుడి శోభాయాత్ర సాగనుంది. ఖైరతాబాద్ నుంచి టెలిఫోన్ భవన్ మీదుగా ట్యాంక్‌బండ్‌పైకి మహాగణపతి ఊరేగింపుగా వెళ్లనుంది. ఊరేగింపు అనంతరం క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం చేయనున్నారు.