18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి వ్యాక్సిన్ వేసుకోవాలి
ఆళ్లపల్లి, , ప్రజాకలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆళ్లపల్లి మండల వ్యాప్తంగా ప్రతి గ్రామాలలో ఉన్న 18 సంవత్సరాలు దాటిన వ్యక్తి వ్యాక్సినేషన్ వేసుకోవాలని ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలు కందుల సంధ్యారాణి అన్నారు అనంతరం వారు మాట్లాడుతూ శనివారం అనంతోగు,జిన్నెలగుడెం , తిర్లాపురం వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని వైద్య సిబ్బంది మీకు అందుబాటులో మీ గ్రామాలకు వస్తున్నారని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అదే క్రమంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డెంగ్యూ, మలేరియా విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉన్నందున ఇంటి పరిసర ప్రాంతాలలో చెత్త చెదారం నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు మురికి కాలువల ప్రాంతాలలో డ్రైనేజీల ప్రదేశాలలో నిలవరాదన్నారు వ్యాక్సిన్ అందరూ చేసుకునేలా గ్రామాలలోని ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు ప్రోత్సహించే విధంగా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ మంకీడి నరేష్, ఏ ఎన్ యం పెండకట్ల రమణ, ఆశా వర్కర్లు చంద్రకళ, విజయలక్ష్మి, కావేరి, శిరోమణి,సావిత్రి, సునీత, చూక్కమ్మ,సుగుణ తదితరులు పాల్గొన్నారు