రుద్రంగి, సెప్టెంబర్ 20, (ప్రజాకలం ప్రతినిధి)
గణేష్ ఉత్సవాల్లో భాగంగా ప్రతీ ఏటా రుద్రంగి మండలకేంద్రంలోని ఆదర్శయూత్ యువజన సంఘానికి చెందిన గణపతి లడ్డు వేలం వేయటం ముందునుండి వస్తున్న ఆనాయితీ. ఈ సారి వేలం పాటలో హోరా హోరీగా లడ్డును దక్కించుకొనేందుకు పలువురి పోటీ పడ్డారు. గణేశుడిని డీజే పాటలు, యువతీ, యువకుల డాన్స్ ల సందడి నడుమ గణపతి అల్లూరివాడ వీధిలోకి ఊరేగింపుగా వచ్చి తరువాత వేలం పాట నిర్వహించారు. వేలం పాటకు పెద్ద ఎత్తున పోటీ జురుగగా అనూహ్యంగా ఇదే గ్రామానికి చెందిన అల్లూరి గోవర్ధన్ రెడ్డి – రాజేశ్వరి దంపతులు రూ. 13,016 పలికి ఈ లడ్డును దక్కించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గణపతి లడ్డును దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఇట్టి లడ్డుని పలువురికి ప్రసాదం రూపంలో పంచి పెట్టనున్నట్లు వారు తెలిపారు.