Tuesday, October 19, 2021
Google search engine
Homeతెల౦గాణ‌ఆసరా పెన్షన్ లో జాప్యం

ఆసరా పెన్షన్ లో జాప్యం

– తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు

మెట్ పల్లి రూరల్, సెప్టెంబర్ 20, (ప్రజా కలం ప్రతినిధి) తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్ పథకం ద్వారా పేద మధ్య తరగతుల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి కాగా ఆసరా పెన్షన్ లో జాప్యం చేయడం ద్వారా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని బీజేపి మండల అధ్యక్షుడు పీసు రాజేందర్ అన్నారు. సోమవారం అయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ తన జీతాలు మాత్రం ఒకటో తారీకు లోపే వేయించుకుంటారు. కానీ ప్రజలు మీద నిర్లక్ష్యం ఉండడం ద్వారానే ఆసరా పెన్షన్ లో జాప్యం చేస్తున్నాడని తెలిపారు. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలపై ఎలాంటి చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలపై చిత్తశుద్ధితో అర్హులందరికీ అందించే పథకాలపై సక్రమంగా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆసరా పెన్షన్ జాప్యం జరగడం వల్ల పెన్షన్ మీద ఆధారపడే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పెన్షన్ నిధులు వెంటనే విడుదల చేసి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments