Saturday, May 21, 2022
Google search engine
Homeతెల౦గాణ‌జర్నలిస్టుల సమస్యల పరిష్కారించాలి

జర్నలిస్టుల సమస్యల పరిష్కారించాలి

జర్నలిస్టుల సమస్యల పరిష్కారించాలి
– ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి
– కరోనతో మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబానికి 25 లక్షల సహాయం అందించాలి
– ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డులు వెంటనే అందించాలి
– టిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కుడుతాడి బాపురావు
– జిల్లా కలెక్టరేటు ముందు జర్నలిస్టుల నిరసన

కరీంనగర్…ప్రజా కలం న్యూస్) :
జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కుడుతాడి బాపురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బాపురావు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ప్లే కార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు.ఈ సందర్భంగా బాపురావు మాట్లాడుతూ….తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. ముఖ్యంగా జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళు లేదా ఇళ్ళ స్థలాలివ్వాలని, చాలా రోజులుగా అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. చాలామంది జర్నలిస్టులు సొంత ఇళ్ళు లేక అద్దె ఇళ్ళల్లో ఉంటూ ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళు లేదా ఇళ్ళస్థలాలివ్వాలన్నారు. విలేకరిగా పని చేస్తున్న ప్రతీ ఒక్కరికీ అక్రెడిటేషన్ కార్డు ఇవ్వాలన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. జర్నలిస్టు తీన్మార్ మల్లన్న పై పోలీసుల వేధింపులు ఆపాలన్నారు. జర్నలిస్టులపై దాడుల నిరోధానికి జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని, ఒక్కో కుటుంబానికి 25 లక్షల ఆర్ధిక సహాయం అందించాలన్నారు. కరోనా పాజిటివ్ వున్న జర్నలిస్టులకు వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించాలన్నారు. జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఇచ్చిన హెల్త్ కార్డులు అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న పత్రికలు, కేబుల్ టీవీ, వెబ్ చానళ్ళను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రస్థాయి మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. మీడియా అకాడమీకి బడ్జెట్ పెంచాలని, సమాచార శాఖకు పూర్తి స్థాయి కమీషనర్ నియమించాలన్నారు. పత్రికా కార్యాలయాల్లో మహిలళ జర్నలిస్టులకు ప్రత్యేక సౌకర్యాల కల్పించాలని, జర్నలిస్టులకు వెజ్ బోర్డు అమల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీర్ఘకాలంగా అపరీష్కృతంగా వున్న పై డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు శ్రీకాంత్, కొమ్మెర తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు బానుచందర్, హుజురాబాద్ డివిజన్ అధ్యక్షుడు పంతాటి రవీందర్, కార్యదర్శి యోహాన్, జర్నలిస్టులు రషీద్, సమ్మయ్య, రాధాకృష్ణ, సంతోష్, ఖాజా, రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, నీల రాజు, కృష్ణహరి, కరుణాకర్, రఫీ జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments