కోలాటం నృత్యాలతో ఆకట్టుకున్న ప్రదర్శనలు..
గణేశుల రవి ఆధ్వర్యంలో ముగిసిన వేడుకలు..
తల్లాడ సెప్టెంబర్ 20 (ప్రజా కలం న్యూస్) :
తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామంలో గణేష్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఆదివారం రాత్రితో వేడుకలు ముగిశాయి. తొలుత విగ్రహం వద్ద గణేషుల శ్రీనివాసరావు చివరిరోజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు, చిన్నారులు కోలాటం నృత్యాల ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. జై బోలో గణేష్ మహరాజ్ కి జై.. అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. టిఆర్ఎస్ మండల నాయకులు, స్థానిక నేత గణేషుల రవి ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజుల నుంచి విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించి గతంలో ఎన్నడూ లేనివిధంగా కార్యక్రమాలు చేపట్టారు. ఆదివారం రాత్రి గణేష్ విగ్రహాన్ని ట్రాక్టర్ ద్వారా ర్యాలీలో భద్రాచలం తరలించి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ యూత్ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.