Tuesday, October 19, 2021
Google search engine
Homeక్రైమ్రంగాపూర్ లో కులవివక్ష చూపుతున్న గ్రామ పెద్దలు

రంగాపూర్ లో కులవివక్ష చూపుతున్న గ్రామ పెద్దలు

రంగాపూర్ లో కులవివక్ష చూపుతున్న గ్రామ పెద్దలు

వసతుల భవనంలో సామాజిక వర్గాలకు. ఇరుకు గదులు ఎస్సిలకు

షాద్ నగర్ నందిగామ సెప్టెంబర్ 20 ప్రజా కలం న్యూస్:- అంగన్ వాడి కేంద్రాలలో కుల వివక్ష చూపుతున్నది, గ్రామ పెద్దలా..? అధికారులా..? నందిగామ మండలం రంగాపూర్ గ్రామ పంచాయితీలో కొంగర మహేష్, ప్రకన చేశారు, రంగాపూర్ గ్రామంలో ఎస్సీలు అధికంగా పిల్లలుండే అంగన్వాడీ కేంద్రం-2 కు నాట్కో కంపనీ ఆర్థిక సాయంతో సాయినగర్ కాలనీలో సొంత భవనం మంజూరు చేసింది, అయినప్పటికీని ఎస్సి పిల్లకు అందులో వారికి ప్రవేశం లేకుండా పోయింది, ఎస్సి పిల్లల్ని గ్రామ పెద్దల సలహాతో గ్రామానికి మంచినీటి సరఫరా కేంద్రమైన చిన్నగదిలో, ఒక పక్కన నీటి శుద్ధి కర్మారాగాల యంత్రాలు ఉండగా మరో వైపు ప్లాస్టిక్ కవర్లతో అడ్డుపెట్టి చిన్న ఇరుకుగుదిలో నడుపుతున్నారు. ఈ గది పక్కనే విద్యుత్ నియంత్రికతోపాటు ఇతర ప్రమాదకర వస్తువులున్నాయి, పిల్లలు, బాలింతలకు ఎలాంటి బాత్రూమ్ వసతులు లేకుండా నిర్వహిస్తురు, కానీ అన్ని వసతులతో నిర్మించిన నాట్కో కంపనీ భవనంలో ఇతర సామాజిక వర్గాల అంగన్వాడీ కేంద్రం-1 నిర్వహిస్తున్నారు, కులవివక్ష చూపుతుంది, గ్రామ పెద్దల, లేకా అధికారుల అని గ్రామస్తులు, అంగన్వాడీ అధికారులు, గ్రామ పెద్దల ద్రుష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయిందని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఒక్క చిన్న గదిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పిల్లలతో కేంద్రాన్ని నిర్వహిస్తున్నారని మండి పడుతున్నారు. ఈ విషయం అధికారులు, గ్రామ పెద్దల ద్రుష్టికి తీసుకెళ్లిన ఎలాంటి ఫలితం లేకుండా పోయింది సంబంధిత అధికారులు తగిన న్యాయం చేస్తారని కోరుతున్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments