మోర్తాడ్: సెప్టెంబర్ 20(ప్రజా కలం ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బండి నారాయణ ఆధ్వర్యంలో మండల ప్రెస్ క్లబ్ కార్యవర్గ సంఘ సభ్యులు, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో వార్త కవరేజ్ కి వెళ్ళిన రాజ్ న్యూస్ జర్నలిస్టు రఫీ పై మల్యాల మండల ఎస్సై నాగరాజు కొడిమ్యాల మండల ఎస్సై అశోక్ లు రాజ్ న్యూస్ రఫీ పై చేయి చేసుకోవడం దాడి చేయడం మోర్తాడ్ మండలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండించడం జరిగింది. రాజ్ న్యూస్ విలేఖరి రఫీ పై దాడి చేసిన ఎస్ఐలపై జిల్లా ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు చేపట్టాలని మళ్లీ ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా చూడాలని మోర్తాడ్ మండల తాసిల్దార్ శ్రీధర్‌కు, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డికి మోర్తాడ్ మండలం లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బండి నారాయణ ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేయడం జరిగింది. జర్నలిస్టులకు కల్పించిన హక్కులను కాల రాయావద్దని, జర్నలిస్టుల పై పోలీస్ అధికారులు గాని, నాయకుడిగానే దాడులు చేయడం మానుకుని, జర్నలిస్టులకు స్వేచ్ఛ హక్కులు కల్పించాలని, మళ్లీ జర్నలిస్టులపై ఇలాంటి సంఘటనలు జరగకుండా జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టి, మళ్లీ ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా చూడాలని మోర్తాడ్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బండి నారాయణ, ఉపాధ్యక్షులు డాక్టర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శి షేక్ హుస్సేన్, కార్యదర్శి భరత్, సామ్రాట్ అశోక్, రంజిత్, పి.ఎన్. ఆర్. ముఖ్య సలహాదారులు సాదిక్, సురేష్ గౌడ్, అధికారులకు వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడారు.