లేబర్ కోడ్స్ రూల్స్ తయారీని నిలిపివేయాలి
లేబర్ ఆఫీస్ ఎదుట ఐ. ఎఫ్.టి.యు. ధర్నా
రాష్ట్ర కమిటీ సభ్యులు చింత భూమేశ్వర్ డిమాండ్
జగిత్యాల, సెప్టెంబర్ 20,(ప్రజాకలం ప్రతినిధి)
కార్మికుల కడుపుకొట్టేలా, సమ్మె హక్కును హరించేలా రాష్ట్ర ప్రభుత్వాల చేత రూపొందిస్తున్న లేబర్ కోడ్స్ రూల్స్ ను రూపొందించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలని ఐ. ఎఫ్.టి.యు.రాష్ట్ర కమిటీ సభ్యులు చింత భూమేశ్వర్ డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆఫీస్ ఎదుట కార్మికులతో కలిసి భూమేశ్వర్ ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. అనంతరం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా భూమేశ్వర్ మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తునాయన్నారు. 8 గంటల పని స్థానంలో 12 గంటల పని, సమ్మె హక్కును హరించేలా, పరిశ్రమలను సులభంగా మూసివేసెలా కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. కార్మికులను తొందరగా తొలగించేలా ఫీక్సుడ్ టర్మ్ ఎంప్లొయ్ మెంట్ విధానాన్ని కేంద్రం ముందుకుతెచ్చిందన్నారు. ఈ నాలుగు లేబర్ కోడ్స్ రూల్స్ రూపొందించే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అప్పగించిందన్నారు. కార్మికుల హక్కులను, కడుపుకొట్టేలా ఉన్న ఈ నాలుగు కొడ్స్ అమలుచేయారాదని భూమేశ్వర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎందరో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో అతి తక్కువ వేతనాలతో లక్షల మంది పని చేస్తున్నారన్నారు. 2016లొనే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఆదేశించినా నేటికి అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు నేటికి పీఎఫ్, ఈ ఎస్ ఐ అమలు కావడంలేదన్నారు. కార్మికుల కడుపుకొట్టేలా, సామాజిక భద్రతను దూరం చేసేలా ఉన్న ఈ నాలుగు చట్టాలను నిలిపివేయాలని కోరారు. అలాగే మానిటైజేషన్ పేరుతో ప్రభుత్వ ఆస్తుల విక్రయం, ప్రైవేటీకరణ, రైతాంగానికి కీడు చేసే వ్యవసాయ చట్టాలను, విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర కల్పన, బీడీ పరిశ్రమను కొట్ప చట్టం నుంచి మినహాయించాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ ను రెగ్యులరైజ్ చేయాలని, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని మరికొన్ని డిమాండ్స్ ను అమలు చేయాలని భూమేశ్వర్ ధర్నాలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగాధర్, రహీం, రమేష్, బాలయ్య, గాజంగి రాజేశం, అరెళ్లి బీమయ్య తోపాటు కార్మికులు ఉన్నారు.