వ్యాపారుల నమోదు, ఖాతా నిర్వహణ సేవలను తెలుగులో ప్రారంభించిన అమెజాన్
● దీంతో భాషాపరమైన అడ్డంకులను అధిగమించి ఈ-కామర్స్ అవకాశాలు పొందనున్న లక్షలాది కొత్త ఎంఎస్ఎంఈలు
● వ్యాపారుల వెబ్సైట్, వ్యాపారుల మొబైల్ యాప్‌లలో ఇప్పుడు తెలుగు భాష. దాంతోపాటు గుజరాతీ, కన్నడ, మరాఠీ, మలయాళం, బెంగాలీ, తమిళం, ఇంగ్లీషు కూడా.
ప్రజాకలం ప్రతినిధి)
● 2020 జూన్ నుంచి ఇప్పటివరకు హిందీ, గుజరాతీ, తమిళం, కన్నడ భాషల్లో లక్ష మందికి పైగా వ్యాపారుల నమోదు
సెప్టెబర్ 20, 2021: పండగ సీజన్‌కు ముందు అమెజాన్ ఇండియా తమ వ్యాపారుల నమోదు, ఖాతాల నిర్వహణ సేవలను తెలుగులో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే ఉన్న లక్షలాది మంది అమెజాన్ వ్యాపారులతో పాటు టైర్2, ఇంకా దిగువ మార్కెట్లకు చెందిన కొత్త వ్యాపారులకూ మేలు కలుగుతుంది. వాళ్లంతా తమకు నచ్చిన భాషలో అమెజాన్.ఇన్ మార్కెట్‌ప్లేస్‌లో తమ వ్యాపారాలు నడుపుకోవచ్చు.
ఇప్పుడు వ్యాపారులు అమెజాన్.ఇన్‌లో తెలుగు, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, మలయాళం, తమిళం, ఇంగ్లీషు లాంటి 8 భాషల్లో దేంట్లోనైనా నమోదుచేసుకుని, తమ ఆన్లైన్ వ్యాపారాలు చేసుకోవచ్చు. ఈ ప్రాంతీయ భాషలద్వారా వ్యాపారులు తొలిసారి అమెజాన్ వ్యాపారిగా నమోదుకావడం నుంచి ఆర్డర్ల నిర్వహణ, ఇన్వెంటరీ, తమ పనితీరు అంచనా – ఇవన్నీ తమ భాషలోనే చేయొచ్చు. ఇదంతా అమెజాన్ సెల్లర్ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్ లోనూ ఉంది.
“భారతదేశంలో 2025 నాటికి కోటి ఎంఎస్ఎంఈలను డిజిటైల్ చేస్తామన్న మా మాట మేరకు.. మా వ్యాపారులు ఈ-కామర్స్‌ను ఉపయోగించుకుని తమ వ్యాపారాలను వృద్ధి చేసుకోవడంలో ఉన్న సవాళ్లను అధిగమించడం చాలా ముఖ్యం. భారతీయ ఎంఎస్ఎంఈలు ఎదుర్కొనే సమస్యల్లో భాష చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఖాతాల నిర్వహణ సేవలనూ తెలుగులోకి తేవడంతో ఎంఎస్ఎంఈలు ఆన్లైన్ వ్యాపారం చేయడం చాలా సులభం అవుతుంది” అని అమెజాన్ ఇండియా సెల్లర్ పార్టనర్ సర్వీసెస్ డైరెక్టర్ సుమిత్ సహాయ్ తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, “వ్యాపారులకు ప్రాంతీయ భాషలను చేరువ చేసినప్పటి నుంచి లక్ష మందికి పైగా వ్యాపారులు తమ వ్యాపారాలను డిజిటైజ్ చేసుకున్నారు. ఇప్పుడు పండుగల సీజన్ రావడంతో తెలుగును చేర్చడం వల్ల మరింతమంది తమ వ్యాపారాలను ఆన్లైన్లో మొదలుపెట్టి, దేశవ్యాప్తంగా కస్టమర్లకు సేవ చేస్తారు. తద్వారా తమ వ్యాపారాలను ఎన్నోరెట్లు పెంచుకుంటారు” అని చెప్పారు.
వ్యాపారులకు తెలుగు సేవలను ప్రారంభించేందుకు అమెజాన్.ఇన్ ముందుగా భాషావేత్తలతో కలిసి కచ్చితమైన, సమగ్రమైన అనుభవాన్ని అన్ని భాషల్లో అందించింది. ఈ బృందం ఎక్కువగా వాడే పదాలకు సరైన అనువాదం తీసుకుని, వ్యాపారులందరికీ సులభంగా అర్థమయ్యేలా రూపొందించింది. అడ్వాన్స్డ్ మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీ సాయం నిపుణుల ప్రయత్నాలకు తోడైంది. తద్వారా ఈ ప్రాజెక్టు అన్ని భాషల్లో ఒకేసారి ప్రారంభమైంది.
ఎవరైనా వ్యాపారులు భాష మార్చాలనుకుంటే చాలా సులభంగా అమెజాన్ సెల్లర్ వెబ్సైట్, సెల్లర్ మొబైల్ యాప్‌లో చేసుకోవచ్చు. డెస్క్ టాప్ ద్వారా నమోదుచేసుకునేవారు ప్రతి పేజీలో కుడిచేతి మూల అందుబాటులో ఉండే ‘లాంగ్వేజ్ డ్రాప్ డౌన్’ వాడుకోవాలి. సెల్లర్ యాప్‌లో అయితే కిందివైపు ఎడమమూల ఈ లాంగ్వేజ్ డ్రాప్ డౌన్ ఉంటుంది. యాప్‌లో నమోదయ్యేటప్పుడు సెట్టింగుల మెనూలో ఇది కనిపిస్తుంది. భాష మార్చగానే అన్ని పేజీలు కూడా తెలుగులో కనిపిస్తాయి.
తెలుగులో మరిన్ని ఫీచర్లు జోడించి, వేలాది మంది ఎంఎస్ఎంఈలు తమకు నచ్చిన భాషలో నమోదుచేసుకుని, వ్యాపారం చేయడం ద్వారా పొందే ప్రయోజనాలను పొందేందుకు దోహదపడుతుంది.