Tuesday, October 19, 2021
Google search engine
Homeసినిమాహీరోయిన్ నందితా శ్వేత తండ్రి కన్నుమూత..

హీరోయిన్ నందితా శ్వేత తండ్రి కన్నుమూత..

హైదరాబాద్ (ప్రజా కలం ప్రతినిధి)
ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ నందితా శ్వేత. ఈ హీరోయిన్ తండ్రి ఆదివారం కన్నుమూసారు. ఈ విషయాన్ని నందిత తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.నా తండ్రి శివ స్వామి 54 ఏళ్ల వయస్సులో కన్నుమూసారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను అని నందిత తన ట్విట్‌లో పేర్కొంది. నందిత తండ్రి ఇక లేరని తెలుసుకున్న ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తూ, కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కన్నడ చిత్రం నినంద లవ్స్ నందితు చిత్రంతో నందిత తన నట జీవితాన్ని ప్రారంభించింది. ఇప్పుడు కథానాయికగా పలు భాషలలో నటిస్తూ, లేడి ఓరియెంటెడ్ సినిమాలలోను నటిస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments