పిల్లల పట్ల బాధ్యత ఎవరిది
పోచంపల్లి సెప్టెంబర్ 21 ప్రజా కలం ప్రతినిధి…
భూదాన్ పోచంపల్లి మండలం అంతమ గూడెం గ్రామంలో అంగన్వాడి కేంద్రం వద్ద గత కొద్ది రోజుల క్రితం పహరి గోడ కూలిపోవడంతో పట్టించుకోకుండా చుట్టుపక్కల ఉన్న పాములు అక్కడికి వచ్చి చేరడంతో చిన్నపిల్లలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు, స్కూల్ చుట్టుపక్కన పిచ్చి చెట్లు చేరడంతో ఈగలు ,దోమలు చేరి అక్కడ ఉన్న పిల్లలకి కుట్టడంతో ఇబ్బందులకు గురి అవుతున్నారు. మూత్ర శాలలు కూడా సరిగ్గాలేక పిల్లలు ఆరుబయట నే మూత్ర విసర్జన చేస్తున్నారు,స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పిన పట్టించుకోవడంలేదని అన్నారు. గత ఐదు సంవత్సరాల క్రితం నుండి ప్రాథమిక పాఠశాల ఓపెన్ చేయకపోవడం వల్ల పక్కన ఉన్న చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామం లో ప్రైవేట్ స్కూల్ కి వెళ్తున్నారు, అక్కడ ఫీజులు అధికంగా ఉండడంతో పిల్లల తల్లిదండ్రులు ఇబ్బందులకు గురి అవుతున్నారు.ఇవి ప్రజాప్రతినిధులకు, అధికారులకు కనిపించడం లేదా ఎన్నికల సమయంలో లో ఓట్ల కోసం రాజకీయాలు చేస్తూ నిరంతరం ప్రజల వెంటే ఉంటామని హామీలు ఇస్తూ గెలిచిన తర్వాత అంతా మరిచిపోయి సంబంధం లేక ఉంటున్నారు. డంపింగ్ యార్డ్ ను పరిశీలించగా అక్కడ ఉండాల్సిన చెత్తాచెదారం డంపింగ్ యార్డ్ లో కాకుండా పక్కనపెట్టి కలుస్తున్నారు,అవి పూర్తిగా కాలకుండా గాలి వచ్చినప్పుడు చెల్లాచెదురై పడిపోతుంది. పింఛన్లు కూడా సమయానికి ఇవ్వడంలేదని వృద్ధులు తెలిపారు.