డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి
-మద్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి పరిపండ్ల నరహరి
-*బీ.ఆర్ అంబేడ్కర్ జన్మస్థలం మౌ మట్టి నిమర్జనం
-*ఎస్సీ,ఎస్టీ,బీసీ,నిరుపేద అగ్రవర్ణాలవారు
సామాజికంగా..ఆర్థికంగా..రాజకీయం రంగాల్లో
రాణించాలి
పెద్దపల్లి,సెప్టెంబర్ 20:(ప్రజాకలం ప్రతినిధి)
చదువుకోవాలన్న తపన,కష్టాలకోర్చి కృషి చేసే మనస్తత్వం,లక్ష్యం చేరుకోవాలన్న పట్టుదల ఉంటే చాలు,జీవితంలో ఏదైనా సాధించవచ్చని అందుకు పేదరికం ఎంతమాత్రం అడ్డుకాదని నిరూపించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని మద్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి పరిపండ్ల నరహరి పేర్కోన్నారు.సోమవారం ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘం,ఆలయ ఫౌండేషన్ ఆద్వర్యంలో జూలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌ మట్టి నిమర్జన కార్యక్రమా నికి మద్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి పరిపండ్ల నరహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయనకు ఎస్సీ,ఎస్టీ,బీసీ తోపాటు నిరుపేద అగ్రవర్ణ కుల సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు.డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ జన్మస్థలం మౌ భీమ్ జన్మభూమి నుండి తీసికొచ్చిన మట్టిని మండలం కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ముందు ఎస్సీ, ఎస్టీ,బీసీ,నిరుపేద అగ్రవర్ణ కుల సంఘాల నాయకులతో కసిలి నిమర్జనం చేశారు.అనంత రం ఐఎఎస్ అధికారి నరహరి మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలకు,ఆలోచనా విధానాన్ని ముందుకు తీసకపోవాలనే ఉద్దేశంతోఅంబేడ్కర్ విగ్రహం ముందు మద్యప్రదేశ్ రాష్ట్రం మౌ పట్టణం నుండి తెచ్చిన మట్టిని పెట్టడం జరిగిందని,తను ఒక పేదకుటుంబంలో జన్మించానని,చదవడం తన స్థోమతకు మించిందే అయినప్పటికీ అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్ ద్వారా దాన్ని సాధించి నేడు ఐఏ ఎస్ అధికారిని అయ్యానని అంబేడ్కర్ కల్పించిన దయవల్లే విద్యలో సులువుగా రాణించి ఉన్నత స్థాయిలో నిలిచానన్నారు.బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు విద్య,వైద్యం,ఉపాధి తోపాటు రాజకీయంగా అందరు రాణించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అంతక ముందు ధూళికట్ట లోని బౌద్ద స్థూపాన్ని ఆయన సందర్శించారు.ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు నల్ల మనోహర్ రెడ్డి,జడ్పీటీసీ గంట రాములు,మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్,ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ రాష్ట్ర, జిల్లా నాయకులు మామిడిపల్లి బాపయ్య, కొంకటి లక్ష్మణ్,బొంకూరి మధు,మంతెన లింగయ్య,మార్కాపురం చంద్రమౌళి,లంక సదయ్య,మామిడిపల్లి చంద్రశేఖర్,మారుమూల శ్రీనివాస్,ఆలయ ఫౌండేషన్ సీఈఓ ఫీట్ల రమేష్, డిప్యూటీ సీఈఓ మిట్టపెల్లి రాజేంద్ర కుమార్, కన్నం తిరుపతి,బండి శ్రీనివాస్,మామిడి పెళ్లి కాంతయ్య,హరి కిళ్ళ, రామలక్ష్మి,చంద్రకళ, జనగామ రాజనర్సు,శ్రావణి సర్పంచ్ నరసింహ యాదవ్,కంకణా జ్యోతిబసు తోపాటు ఎస్సీ, ఎస్టీ,నీరుపేద అగ్రకుల నాయకులు, ప్రజాప్రతినిధులు,మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.