వికలాంగుల యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా
జగిత్యాల టౌన్, సెప్టెంబర్ 21 (ప్రజా కలం):వికలాంగులకు ప్రతి నెలలో ఐదో తారీకు లోపల పింఛన్ ఇవ్వాలని వికలాంగుల యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందుధర్నా నిర్వహించి, అనంతరం ఏవో కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ జిల్లా కన్వీనర్ అబ్దుల్ అజీజ్ , వికలాంగుల సలహాదారుడు జి. తిరుపతి నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్ ప్రతి నెల ఐదో తారీకు లోపు ఇవ్వాలని అన్నారు. అర్హులైన వికలాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఐదు శాతం కేటాయించాలని మరియు ఖాళీ స్థలం ఉన్న వికలాంగులకు ఇంటి నిర్మాణం డబ్బులు ప్రభుత్వం మంజూరు డిమాండ్ చేశారు . ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నిటిలో విక్రమ్ వికలాంగులకు 5% కేటాయించాలని సంక్షేమ పథకాల్లో 25 %అదనంగా చెల్లించాలి అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన దళిత బందులో అర్హులైన వికలాంగులకు 12.50 లక్షల రూపాయలు చెల్లించాలి, దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక లో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చదువుతో నిమిత్తం లేకుండా వైకలయ తీవ్రతను బట్టి మోటార్ వెహికల్, బ్యాటరీ వీల్ చైర్ ఇవ్వాలి, వెంటనే పెండింగ్లో ఉన్న వివాహ ప్రోత్సాహకం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని మరియు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం లో రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం అధికారులు మరియు వికలాంగుల సంఘాలతో కల్పి సమన్వయ కమిటీ తక్షణమే ఏర్పాటు చేయాలని, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు లక్ష్మణ్ గారు ఈ ధర్నాను మద్దతుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ సభ్యులు ఎండి.ఇంతియాజ్ , ఎండి. ఫిరోజ్, ప్రవీణ్, భాస్కర్, రాజారామ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.