జగిత్యాల,సెప్టెంబర్21,(ప్రజాకలం ప్రతినిధి)
జగిత్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ అధ్యక్షతన జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్, పల్లె ప్రగతి తో పాటు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ కారోన వ్యాక్సినేషన్ లో భాగంగా జగిత్యాల జిల్లాలోని ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో సమర్ధవంతంగా ముందుకు కొనసాగుతుందన్నారు. వైద్య మరియు పంచాయతీ రాజ్ సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించడం జరిగింది. కరోనా వ్యాక్సిన్ సెంటర్ లో ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా వైద్య అధికారిని ఆదేశించారు. అదేవిధంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారిలను వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ గ్రామాలలో అధిక మొత్తంగా కారోన వ్యాక్సినేషన్ జరిగే విధంగా చూడాలని, వ్యాక్సినేషన్ కు వచ్చే ప్రజలకు మరియు వైద్య అధికారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా జిల్లా పరిషత్ ను సంప్రదించగలరు అని,నిరంతరం కూడా అందుబాటులో ఉంటామని తెలియజేశారు.ముఖ్యమంత్రి చేపట్టిన పల్లె ప్రగతి అనే గొప్ప కార్యక్రమం వల్ల పల్లెల్లో ఉన్న ప్రజల కోసం వారి మౌలిక సదుపాయాల కోసం వారి ఆరోగ్య పరిరక్షణకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చారిత్రాత్మకమైన నిర్ణయమని అన్నారు. కాబట్టి జగిత్యాల జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగాలని అన్నారు. సీజనల్ వ్యాధులు మరియు అదే విధంగా ఇతర అనారోగ్య వ్యాధుల బారిన ప్రజలు పడకుండా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని స్పెషల్ డ్రైవ్ గా చేపట్టాలని అన్నారు. అదేవిధంగా పల్లె ప్రగతి లో భాగంగా అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తిచేయాలని, ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు సమన్వయంతో మండలాలను అభివృద్ధి పథంలో ఉంచాలని అన్నారు.ఎస్సీ కార్పొరేషన్ పథకాల గురించి ప్రజల్లో అవగాహన ఎక్కువగా కల్పించాలని, తద్వారా జిల్లా మంత్రివర్యులు ఈశ్వర్ అన్న ఆధ్వర్యంలో అధిక మొత్తంలో లో ఎస్సీ కులస్తులందరికీ లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని ఎంపీడీఓలకు మరియు ఎస్ సి కార్పొరేషన్ అధికారిని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ సంధ్యారాణి, జిల్లా వైద్య అధికారి శ్రీధర్, జిల్లా పంచాయతీ అధికారి నరేష్ మరియు మండల అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు.