గల్లీ లో కుస్తీ…ఢిల్లీలో దోస్తీ…!
-*కునారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కాంగ్రెస్ నాయకుల ధర్నా
పెద్దపల్లి (ప్రజాకలం ప్రతినిధి)
దశాబ్దాల కాలంగా పెద్దపల్లి ప్రజల చిరకాల కోరికగా మిగిలిఉన్నా కూనారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి త్వరగతిన నిర్మాణం చేపట్టాలని జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు ఈర్ల కొమురయ్య ప్రభుత్వా లను డిమాండ్ చేశారు.కునారం రోడ్డు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ జాప్యంపై మంగళవారం కునారం రైల్యే గెటు వద్డ కాంగ్రెస్ నాయకుల ధర్నా చెపట్టి నిరసన తెలిపారు.ఈ సందర్బంగా జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు ఈర్ల కొమురయ్య మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా ఏర్పాటైన తర్వాత వ్యాపార వాణిజ్య కేంద్రంగా విరాజిల్లు తున్న ఈ తరుణంలో జిల్లా చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలు,వ్యాపారస్తులు,విద్యార్థులు సంబండ వర్గాలు ముఖ్యంగా అత్యవసరమైన సమయాలలో వైద్యం అందాల్సిన రోగులు పెద్దపల్లి కునారం రోడ్ లో గల రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి లేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అత్యవసర పరిస్థితుల్లో పనిచేసే వైద్య సిబ్బంది పరీక్ష రాసే సమయాల్లో విద్యార్థులు ఇతర అనేక రంగాల్లో పనిచేసే వారందరు తమ సమయాన్ని వృదా చేసుకుని గంటల తరబడి నిరీక్షించవలసి వస్తుందని అన్నారు.పెద్దపల్లి పార్లమెంటు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ వెంకటేష్ నేత ఇటీవల కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసిన సందర్భంలో పెద్దపల్లి కునారం ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకోకపోవడం తీవ్ర విచారకరమని అన్నారు. స్థానిక ఎంపీ,ఎమ్మెల్యే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో పూర్తిగా విఫలమయ్యార ని,ప్రజా సమస్యలను గాలికొదిలేసారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి గల్లీ లో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్న చందంగా తయారైందనీ అన్నారు.ఇప్పటికైనా ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ ధర్నా కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అద్యక్షులు ఎస్ కే అక్బర్ అలీ, మండల అద్యక్షులు కడార్ల శ్రీనివాస్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్పీ రాజయ్య, జిల్లా కార్యదర్శి పి యస్ విజయ్ కుమార్,జిల్లా సంయుక్త కార్యదర్శి గౌసియ బేగం,ఇగ్బాల్, వేముల రాజు,గోషిక రాజేష్,గాండ్ల మోహన్, మనుమండ్ల శ్రీనివాస్,మహంకాళీ అంజయ్య, సదానందం తది తరులు పాల్గోన్నారు.