కూడా చైర్మన్ బీసీలకే ఇవ్వాలి.
✍️టిఅర్ఎస్ ప్రభుత్వంలో కీలక పదవులు బీసీలకు ఇవ్వడం లేదు.
(ప్రజా కలం)
త్వరలో చెప్పట్టనున్న కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కూడా) చైర్మన్ పదవి ఈ సారి తప్పకుండా బీసీలకే ఇవ్వాలి అని బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వరుసగా 2 సార్లు ఈ పదవి అగ్ర వర్ణలకే ఇవ్వడం జరగింది అని, జనాభాలో 55% ఉన్న బీసీలకు ఈ సారి తప్పకుండా కూడా చైర్మన్ పదవి ఇవ్వాలని అన్నారు. కూడా చైర్మన్ పదవి కాలం త్వరలో ముగియనుండగా ఈ పదవికి ఈసారి కూడా జనాభాలో 0.5 శాతం, 1శాతం ఉన్న అగ్రవర్ణాల వాళ్ళు డబ్బుల ఆశతో, నాయకుల పలుకుబడి, అండదండలతో వారికి వచ్చే విదంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నగరంలో మెజార్టీ జనాభా గల బీసీలకు ఈ సారి ‘కూడా’ చైర్మన్ ఇవ్వకుంటే రాబోయే రోజుల్లో బీసీలు టిఆర్ఎస్ పార్టీకి దూరం అవుతారు అని అన్నారు. టిఆర్ఎస్ పార్టీలో రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి నామినేటెడ్ పదవులు అన్ని అగ్రవర్ణాలకు కట్టబెడుతూ, ప్రాధాన్యత లేని నామినేటెడ్ పదవులను బడుగు బలహీన వర్గాల ప్రజలకు అంటగడుతున్నారు అని వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ వాపోయారు. ఇకనైనా ఈ పద్ధతికి స్వప్తి చెప్పి జిల్లాలో ప్రాధాన్యత గల కూడా చైర్మన్ బీసీలకు అవకాశం ఇవ్వాలని అన్నారు.