Friday, May 20, 2022
Google search engine
Homeతెల౦గాణ‌మహిళల భద్రత కి ప్రత్యేక చర్యలు

మహిళల భద్రత కి ప్రత్యేక చర్యలు

మహిళల భద్రత కి ప్రత్యేక చర్యలు, పొక్సో కేసులలోని నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి
(ప్రజా కలం ప్రతినిధి)

గురువారం. ఎన్టీపీసీ లోని మిలీనియం హాలు నందు రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్(డిఐజి) పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ “క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్” ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి భాదితులకు న్యాయం చేకూర్చడంలో అధికారులంతా న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ భాద్యతగా వ్యవహరించాలని సూచించారు. పోలీసు స్టేషన్లలో నమోదయ్యే ప్రతీ కేసు వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని తెలిపారు. పొక్సో కేసులలో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా అన్ని రకాల ఆధారాలను కోర్టు వారికి సమర్పించాలని సూచించారు. కొత్త కొత్త మార్గాల ద్వారా సైబర్ నేరగాళ్లు అమాయకపు ప్రజల నగదును దోచుకోవడానికి యత్నిస్తున్నారని, ఇట్టి నేరగాళ్ల బారిన పడకుండా కమిషనరేట్ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు. సైబర్ నేరాల బారిన పడి నగదును కోల్పోయిన భాదితులు ఆలస్యం చేయకుండా టోల్ నెంబర్ 155260, డయల్ 100,112 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసే విధంగా అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయధికారులతో సమన్వయం పాటిస్తూ భాదితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిరంతరం విధులలో ఉండే పోలీసు అధికారులు మరియు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బ్లూ కోల్ట్స్,పెట్రోలింగ్, బీట్స్ ద్వారా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నేరాల నియంత్రణకై అధికారులంతా తమ క్రింది సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేయాలని తెలిపారు. పీడీఎస్ రైస్, గంజాయి,డ్రగ్స్, గుట్కా, మట్కా, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతర నిఘా ఏర్పాటు చేసి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.5S అమలులో భాగంగా పోలీసు స్టేషన్ పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని,అన్ని రకాల కేసుల ఫైళ్లను ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోవాలని సూచించారు. వివిధ రకాల సమస్యలతో పోలీస్ స్టేషన్లకు వచ్చే భాదితులకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ,వారికి న్యాయం చేకూరుస్తామనే భరోసా కల్పించాలని అన్నారు.ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించాలని,పెండింగ్ చాలన్స్ క్లియర్ చేపించాలని ఆదేశించారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, షీ టీమ్స్ తో అవగహన కార్యక్రమాలు నిర్వహించాలి . పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా స్థానిక ప్రజలకు వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ “నేనుసైతం” కార్యక్రమం ద్వారా కెమెరాలను ఏర్పాటు చేసుకుని,నేరాలను అదుపు చేయడానికి కృషి చేయాలని సూచించారు.చోరీ కేసులలో నిందితులను పట్టుకుని చోరీ సొత్తును రికవరీ చేసి భాదితులకు న్యాయం చేకూర్చే విధంగా కృషి చేయాలని కోరారు.

ఈ సమావేశం లో పెద్దపల్లి డీసీపీ రవీందర్, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఓఎస్డీ శరత్ చంద్ర పవర్, డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్, మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ ఐపీఎస్, ఏసీపీ బెల్లంపల్లి రహెమాన్, ఏసీపీ జైపూర్ నరేందర్,పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి,ఏసీపీ స్పెషల్ బ్రాంచ్ నారాయణ, ఏసీపీ సీసీఎస్ రమణబాబు, ఏసీపీ ఏఆర్ సుందర్ రావు, మల్లికార్జున్, ఏవో నాగమణి, సీఐ లు, ఆర్ఐ లు, ఎస్ఐ లు, పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments