Wednesday, October 20, 2021
Google search engine
Homeతెల౦గాణ‌రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
– ఎంపిపి గంగం స్వరూపరాణి మహేశ్

రుద్రంగి, సెప్టెంబర్ 23,(ప్రజాకలం ప్రతినిధి)

రైతులు ఎప్పుడూ ఒకే రకం పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఎంపిపి గంగం స్వరూపరాణి మహేశ్ అన్నారు. మండల వ్యవసాయ అధికారి అనుష ఆద్వర్యంలో పంటల మార్పిడిపై రైతులకు గురువారం అవగాహన సదస్సు స్థానిక రైతువేదిక భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంపిపి గంగం స్వరూపరాణి మహేశ్, జడ్పీటీసి గట్ల మీనయ్య, వ్యవసాయ అధికారి గోవర్ధన్ హాజరయ్యారు. ఈ సందర్బముగా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపిపి మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటల మార్పిడి చేయాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలైన ఆయిల్‌ పామ్‌, కూరగాయలు, పండ్ల తోటలు, ఉద్యాన పంటలకు ప్రభుత్వం నుంచి అధిక సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. భూసారం ఆధారంగా పంటల మార్పిడి చేయడం వల్ల అధిక దిగుబడితోపాటు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కిసాన్ రావు, రైతుబందు కన్వీనర్ నర్సారెడ్డి, రైతుబందు కో కన్వీనర్ రాజిరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ నారాయణ, ఉప సర్పంచ్ బైరి గంగమల్లయ్య, ఏఈఓ రోచన, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments