Wednesday, October 20, 2021
Google search engine
Homeక్రైమ్రోడ్డు ఇలా... పోయేది ఎలా..?

రోడ్డు ఇలా… పోయేది ఎలా..?

రోడ్డు ఇలా… పోయేది ఎలా..?
– రుద్రంగి – కొత్తపేట రహదారికి ఒర్రె గండం
– ఒర్రెపై కల్వర్టు నిర్మించాలని వినతి

రుద్రంగి,సెప్టెంబర్ 23,(ప్రజాకలం ప్రతినిధి)

వర్షకాలం వచ్చిందంటే మారుమూల గ్రామ వాసుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవలసి వస్తుంది. రుద్రంగి – కొత్తపెట రహదారిలో అడ్డంగా ఉన్న ఒర్రె గండం పట్టుకుంది. కొత్తపేట నుండి ఏడు కిలో మీటర్ల దూరంలో ఉన్న రుద్రంగి రావాలి అంటే అచ్చయ్యకుంట చెరువు నుండి కలిగోట సూరమ్మ చెరువుకు వెళ్ళె పకృతి ఒర్రెను దాటి పోవల్సిందే, అయితే ఇట్టి ఒర్రెపై కల్వర్టు లేకపోవడంతో వర్షకాలంలో నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో అటు కొత్తపేట వాసులకు ఇటు రుద్రంగి మండలకేంద్రానికి చెందిన రైతుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అట్టి ఒర్రె పూర్తిగా తెగిపొయి ప్రమాదకంగా మారింది. కొత్తపేట వాసులు మాట్లాడుతూ.. ఏ చిన్న పనికైన రుద్రంగి వెళ్ళాల్సిందే, ఒర్రె తెగిపోయి వాహనాలు కూడ నడవడం లేదు, స్కూల్ కి వెళ్ళే విద్యార్థులు కొత్తపేట నుండి ఒర్రె వరకు ఒక వాహనంలో వచ్చి, ఒర్రె వద్ద నుండి రుద్రంగి లోని స్కూల్ వరకు మరొక వాహనంలో పోవలసి వస్తుందన్నారు. ఏ చిన్న వర్షం పడిన రోడ్డంత బురదమయంగా మారి నడవడానికి వీలు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ లు వచ్చినపుడు మాత్రం మీకు రోడ్డు వేయించే భాద్యత మాదంటే మాదని రాజకీయ నాయకులు పోటిపడి వాగ్ధానాలు చేస్తరు. ఎలక్షన్ లు అయిపోయాక రోడ్డు గురించి ఊసే ఎత్తరని ఆరోపిస్తున్నారు. ఇప్పటికి మా గ్రామానికి రోడ్డు సరిగా లేక నరకయాతన పడుతున్నాం, రాజకీయ నాయకుల హామీలు మాటలకే పరిమితం అయ్యాయని, మారుమూల గ్రామం అంటే అంత చులకన ఎందుకని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రుద్రంగికి చెందిన రైతులు సైతం రుద్రంగి – కొత్తపేట రహదారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేట వాసులు, రుద్రంగి రైతుల అభ్యర్థన మేరకు గత సంవత్సరం వర్షకాలం ఒర్రెపై మిషన్ భగీరథ పైపులు వేసి తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టారు. అయితే కొద్ది రోజుల తరువాత అట్టి పైపులు మిషన్ భగీరథ వారివి కావడంతో తిరిగి పైపులు తీసుకెళ్ళడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఇప్పటికైన అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రుద్రంగి – కొత్తపేట ప్రమాదకరంగా మారిన ఒర్రెపై కల్వర్టు నిర్మించాలని, కొత్తపేట వాసులు, రుద్రంగి రైతులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments