పనికి వెళ్ళాము కాని పైస రాదాయె
పోచంపల్లి సెప్టెంబర్ 25 ప్రజా కలం ప్రతినిధి…✍️
భూదాన్ పోచంపల్లి మండల కేంద్రము లో ధర్మారెడ్డి పల్లి, వంకమామిడి, దంతూర్, కనుముక్కల గ్రామాలలో ఉపాధి హామీ పథకం పనులు చేసిన కూలి పైసలు రావడంలేదని దినసరి కూలీలు దిగులు పడుతున్నారు. ఈ పైసలు పోస్ట్ మేన్ సకాలంలో ఇవ్వడంలేదు కూలీలను గ్రామపంచాయతీ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిప్పించుకుంటున్నాడు, అడిగినందుకు మీకు ఏమన్నా బాకి ఉన్నానా అని అంటూ ఇష్టం వచ్చిన కాడ చెప్పుకో అంటూ కూలీలతోఎగతాళిగా మాట్లాడుతున్నాడు. పాస్ బుక్ ల పై సంతకం తీసుకొని పది ,పదిహేను రోజుల తర్వాత చెల్లిస్తామని చెపుతూ బెదిరిస్తున్నాడు, రెండు నెలలకు ఒకసారి ఇస్తూ కాలం గడుపుతున్నాడు అని కూలీలు అంటున్నారు, కరోనా సమయంలో కూడా పైసలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే పనికైనా పోతే డబ్బులు వస్తాయి అని అనుకుంటే సమయానికి చేతికి పైసలు రావడం లేదు చేతిలో చిల్లిగవ్వ లేక కనీసం కూరగాయలకు కూడా పైసలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే రేక్కడ తేగానే గాని పూటగడవని పరిస్థితులు మావి కూలీ పని చేసిన పైసలు కూడా చేతికి అందడం లేదని ఆవేదనకు గురి అవుతున్నారు.దీనిపై ప్రజాప్రతినిధులు అధికారులు చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నారు.