రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోట రామచంద్రారెడ్డి
పోచంపల్లి సెప్టెంబర్ 25 ప్రజా కలం ప్రతినిధి…✍️
భూదాన్ పోచంపల్లి. మోడీ బిజెపి ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని గత పది నెలలుగా ఢిల్లీ నడిబొడ్డున జరుగుతున్న రైతు ధర్నా ను పట్టించుకోకుండా నిరంకుశంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఈ నెల 27 న జరుగుతున్న బంద్ లో ప్రతి ఒక్కరు పాల్గొని రైతన్నకు అండగా నిలబడాలని పోచంపల్లి పట్టణ కేంద్రంలో కరపత్రాల పంపిణీ చేయడం జరిగింది .ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోట రామచంద్రారెడ్డి మాట్లాడుతూ దేశానికి వెన్నుముక అయినటువంటి రైతాంగాన్ని మొత్తం తన సొంత ప్రయోజనాల కోసం కార్పొరేట్ వ్యవసాయాన్ని ఆహ్వానిస్తూ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పెట్టే విధంగా మోడీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని స్వేచ్ఛా మార్కెట్ పేరుతో రైతులు ధాన్యాన్ని ఎక్కడ అ ధర ఎక్కువ వస్తే అక్కడ ధాన్యాన్ని అమ్మకం జరుపుకోవాలని రైతాంగాన్ని మొత్తాన్ని దళారుల పెట్టుబడిదారుల కోసమే ఈ రైతు వ్యతిరేక చట్టాలు మోడీ బిజెపి ప్రభుత్వం స్వాగతం పలుకుతుందని వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని లేకుంటే ఉద్యమం మరింత ఉద్రిక్తం చేస్తామని నష్టం కలిగించే ఉపసంహరించుకుంటే గద్దె దిగి అంతవరకు పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వీరితో పాటు రైతు సంఘం నాయకులు పగిళ్ల లింగారెడ్డి, సిఐటియు మండల కన్వీనర్ మంచాల మధు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం మండల ఉపాధ్యక్షులు సాయినాథ్ పాల్గొన్నారు.