దళితులకు ఇక ముందు సూముచిత స్థానం కల్పిస్తాం
వారిని సత్కరించే విధంగా నిర్ణయం ఉంటుంది
జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ గారు
ములుగు (ప్రజా కలం)
రాబోవు పార్టీ పదవులలో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ దళితులకు అధిక ప్రాధాన్యం ఇస్తాం అని జడ్పీ చైర్మన్ మరియు ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ కుసుమ జగదీష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు నిబద్ధత కల మన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిరాశకు గురి కావద్దు అన్నారు దళితులు పార్టీకి చేసిన సేవను గుర్తించి మొట్టమొదటి అవకాశం ఏడు మండలాలకు గాను ఆత్మ చైర్మన్ పదవి ఎస్సీ సామాజిక వర్గానికి ఇచ్చాం అన్నారు దళితుల అభివృద్ధి మరియు అభ్యున్నతి కోసం మన కెసిఆర్ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు ప్రతి ప్రభుత్వ పథకం లోనూ వారికి పెద్దపీట వేస్తామని అన్నారు దళితుల కోసమే దళిత బంధు పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సామాజిక అసమానతలు తొలగించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు ప్రతి కుటుంబానికి నేరుగా మేలు జరిగే విధంగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు త్వరలో ఈ పథకం అన్ని జిల్లాలకు విస్తరింపజేసే యోచనలో ఉందన్నారు దళితులు పార్టీకి సేవ చేసుకోవడమే కాదు వారిని సత్కరించే విధంగా మా నిర్ణయాలు ఉంటాయన్నారు