భారత్ బందును జయప్రదం చేయండి :
అఖిలపక్ష రాజకీయ పార్టీల పిలుపు.
గజ్వేల్: సెప్టెంబర్ (ప్రజా కలం ప్రతినిధి)
ఈనెల 27న తలపెట్టిన దేశవ్యాప్త బందుకు సహకరించాలని ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వానికి దానికి వంత పాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ సమీర్ కోరారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతు సంఘాలకు అలాగే కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్రం తీసుకు వస్తున్న కార్మిక చట్టాలకు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వాలపై నిరసనగా ప్రజల కోసం ప్రజలతోపాటు కలిసి విపక్షాలన్ని ఏకమై చేస్తున్న ఈ భారత్ బంద్ కు ప్రజలందరూ సహకరించి స్వచ్ఛందంగా బందుకు పాటించాలని సి ఐ టి యు, సిపిఐ నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు తూoకుంట నర్సారెడ్డి గారి నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో లో సిపిఐ నాయకులు ఎల్లయ్య సిఐటియు నాయకులు స్వామి,ఫహీం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లారెడ్డి,పట్టణ పార్టీ అధ్యక్షులు మొన్న గారి రాజు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నేత నాగరాజు,జానీ, ఆంజనేయులు,సురేష్ యూత్ కాంగ్రెస్ నాయకులు గుళ్ళపల్లి ప్రవీణ్,టిల్లు రెడ్డి మైనార్టీ నాయకులు తక్కి,కలీం అఫ్రోజ్ తదితరులు ఉన్నారు