మహారాష్ట్రలో మహా అత్యాచారం
15 ఏళ్ల బాలికపై 33 మృగాళ్లచే గ్యాంగ్ రేప్
మహారాష్ట్ర(ముంబై): (ప్రజా కలం ప్రతినిధి)
నిరంతరం దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు జగుతున్న వేల, మహారాష్ట్రలో మహా అత్యాచారం చోటు చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో ఓ బాలిక ప్రేమికుడు ఆమెను లొంగదీసుకొని మానభంగం చేశాడు. ఆ వీడియోను అడ్డం పెట్టుకొని తన దోస్తులతో సన్నిహితులతో ఆమెను బ్లాక్ మెయిల్ చేసి వివిధ ప్రాంతాలకు (దోంభివాలి, బద్లాపూర్, ముర్బార్, రభేల్) తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం చేయసాగారు. ఈ తంతాగం జనవరి 29 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఈ ఘోరం సాగింది. ఎట్టకేలకు ఆ బాలిక పోలీసులను అశ్రహించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. శనివారం సాయంత్రం తూర్పు బాంద్రా స్టేషన్ వద్దగల బెహరాంపాడాలో భారతీయ ముస్లిం మహిళ ఆందోళన్, విద్యార్థి భారతి, భారత్ బచావ్ ఆందోళన్ తదితర సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జర్పారు. ఈ సందర్భంగా మహిళ నేత నూర్జహా సాఫీయా నియాజ్ మాట్లాడుతూ పురుషుల ఆలోచన విధానంలో మార్పు రావాలి, మహారాష్ట్ర పోలీసులు మరింత వేగంగా కృషి చేయాలని కోరారు. ఇలాంటి కృత్యాలు పునరావృతం కాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు. విద్యారి నేత మంజీరి దూరి మాట్లాడుతూ విద్యాభ్యాసంలో సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పాలి, చిన్నప్పటి నుండియే “స్వయం రక్షణ శిక్షణ” అమ్మాయిలకు ఇవ్వాలని హితవు పలికారు. ఈ ప్రదర్శనలో సలోని తొడ్కర్, ఖాతూన్ షేఖ్, భారతి శెట్టి తోపాటు ఫిరోజ్ మిఠిబోర్వాల, రవి బిలాని, తెలుగు నేతలు కాశావేని చంద్రన్న బెస్త, చాంద్ అహ్మద్ షైక్, ఎల్ది రఘునాథ్ పద్మశాలి, మూల్ నివాసి మాల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.