Wednesday, October 20, 2021
Google search engine
Homeఆ౦ద్రప్రదేశ్ముస్లిం సమాజం బస్సు యాత్ర చేసుకునేందుకు అనుమతించని పోలిసులు...

ముస్లిం సమాజం బస్సు యాత్ర చేసుకునేందుకు అనుమతించని పోలిసులు…

ముస్లిం సమాజం బస్సు యాత్ర చేసుకునేందుకు అనుమతించని పోలిసులు…
-*వి.ఎస్. అమీర్ బాబు, కడప అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జ్.
ప్రజాకలం
ముందుగానే రాష్ట్ర డీజీపీ మరియు చిత్తూర్ జిల్లా ఎస్పీ గారు చేసుకోండి అని చెప్పి చివరి క్షణంలో అడ్డగించడం బలహీన సామజిక వర్గం అయినా ముస్లిం సమాజానికి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అని ఆగ్రహం వ్యక్తంచేసిన వి.ఎస్.అమీర్ బాబు.
ఈరోజు కడప టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వి.ఎస్.అమీర్ బాబు మాట్లాడుతూ…
2019 ఎలెక్షన్లో దాదాపు 60 లక్షల ముస్లిం ఓట్లు వైసీపీకి గంప గుత్తగా గుద్దినందుకు.. ముస్లింల సమస్యలను చెప్పుకొని మా వెనుకబడిన సమాజాన్ని చైతన్య పరిచే బస్సు యాత్రని ఎందుకు అడ్డగించారు జగన్ రెడ్డి..?
ఇది మీ దృష్టికి తప్పకుండా వచ్చే ఉంటుంది. మీరు దీనిపై సానుకూలంగా స్పందించి అనుమతించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు
మీ తండ్రిగారు చనిపోయినపుడు ఓదార్పు యాత్ర చేస్తుంటే ఇలాగే అప్పటి ప్రభుత్వం నియంత్రించిందా..? అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి సంకల్ప యాత్ర చేసినప్పుడు ఇలానే అడ్డుకుందా…? కావున ఈ యాత్రల్లో మీకే గొప్ప అనుభవం ఉంది మిరే పరిష్కారించాలి కూడా…!
ముస్లింలే కాదు వారితో పాటు మరిన్ని బలహీన వర్గాల సమస్యలు కూడా ఈ యాత్ర ద్వారా వారిని ఉనికిలోకి తెచ్చి.. దళిత, బహుజన మూలవాసులందరు ఏకతాటిపైకి వస్తారని భయమా…? ఎలక్షన్ సమయంలో ముస్లింలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయమని ముస్లిం సమాజం ఏకతాటిపైకి వచ్చి బస్సు యాత్ర నిర్వహిస్తే బస్సు యాత్ర సభ్యుల మీద.. బస్సుల మీద.. కేసులు పెడతామని బెదిరించడం అలాగే రాష్ట్ర కన్వీనర్ అయినా షేక్ దస్తగిరి, మరియు సభ్యులను మదనపల్లిలోకి బస్సును రానివ్వకుండా మదనపల్లె చుట్టుపక్కల ఉన్న రోడ్లపై వందలాది మంది పోలీసులను మోహరించి మదనపల్లెకు రానీయకుండా చేయడం ముస్లిం ఫెడరేషన్ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడమే..?
అల్ప సంఖ్యాక వర్గాల స్వేచ్చా హక్కును హరిస్తున్నారు.ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుని ముస్లిం సామాజిక వర్గానికి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని.. లేని పక్షంలో కోర్టు ద్వారా అనుమతులు తీసుకుని ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని హెచ్చరించారు.ముస్లింలపై తమకు సవతి తల్లి ప్రేమ ఉందని నిరూపించారు జగన్మోహన్ రెడ్డి గారు… కాంగ్రెస్ ప్రభుత్వంలో 4% రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మీ తండ్రిగారైన రాజశేఖర్ రెడ్డి గారిని గెలిపించడం.. అలాగే రాజశేఖర్ రెడ్డి కుమారుడైన తమకు రెండు పర్యాయాలు ముస్లింలు ఓట్లు వేయడం జరిగింది. ఇకమీదట అలా జరగదు.. ముస్లిం సమాజంలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. తగిన సమయంలో మీకు గుణపాఠం చెబుతారు.ఈ సమావేశంలో కడప నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి, కడప పార్లమెంట్ కార్యదర్శి మాసా కోదండ రామ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments