ప్రజా కలం ప్రతినిధి సంగారెడ్డి జిల్లా మనూర్ మండల పరిధిలోని ఎల్గొయి గ్రామ శివారులో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తగిలి ఆవు మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన గైని మారుతికి చెందిన ఆవు శనివారం మధ్యాహ్నం గ్రామ శివారులో విద్యుత్ ప్రమాదానికి గురైందని గ్రామస్తులు తెలిపారు ఆవు విలువ సుమారు రూ 60000 వరకు ఉంటుందని అన్నారు.