ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి….ఎమ్మెల్యే
జగిత్యాల టౌన్,సెప్టెంబర్ 29(ప్రజా కలం):ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా (నేషనల్ హార్ట్ డే)
రీసెర్చ్ సొసైటీ పర్ స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా మరియు సేవా భారతి జగిత్యాల ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో ఉమా శంకర్ గార్డెన్స్ లో మధుమేహ నిర్దారణ ఉచిత వైద్య శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
సేవా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని, సేవా భారతి జిల్లా అధ్యక్షులు బీమానాతి శంకర్ గారితో చాలా సంవత్సరాల నుండి సన్నిహిత సంబంధం వుందని వారు సేవా గుణం కలవారని అన్నారు.భారత దేశంలో డయాబెటిక్ సమస్య రోజు రోజుకు తీవ్రం అవుతుందని,ప్ర జలు శారీరకశ్రమ, ఆహార అలవాట్లు,వ్యాయామం ద్వారా కపడుకోవచ్చని రోగం వచ్చేదానికంటే దాని రాకుండా నివారణకె అధిక ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యమని, మీడియా ద్వారా జగిత్యాల జిల్లా లో 18 ప్రైమరీ హెల్త్ కేంద్రాలు ఉన్నాయని,ప్రతి రోజు షుగర్ తో పాటు 57 పరీక్షలు గుండె,కొవ్వు,తైరాయిడ్ ఇలా 57 పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారని,ఉచిత పరీక్షలు చేయించుకోవాలని
దరూర్ క్యాంప్ 2 కోట్ల తో దయగ్నిస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించామని ఉచిత పరీక్షలు చేయటం తో పాటు ఆన్లైన్ ద్వారా మెసేజ్ రూపంలో ఫలితాలు వస్తాయని,వైరాలజీ ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేయటం జరిగిందని.
ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేయలేదని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి పనిచేయటం ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని,
ధనిక దేశాల్లో కూడా స్వచ్ఛంద సంస్థల భాగం గొప్పదని,
బీద,మధ్యతరగతి ప్రజలకు దాతృత్వ సంస్థల సేవలు అవసరమని,ఈనాడు సేవా భారతి మధుమేహ ఉచిత నిర్దారణ శిబిరం ఏర్పాటు చేసిన శంకర్ కు ధన్యవాదాలు అని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి, ఐఎంఎ జగిత్యాల అధ్యక్షులు డా.నరహరి, జిల్లా సేవా భారతి అధ్యక్షులు యండి శంకర్, పట్టణ సేవ భారతి అధ్యక్షులు పురుషోత్తం,స్థానిక కౌన్సిలర్ లు అల్లే గంగసాగర్,రాజ్ కుమార్, నాయకులు భోగ ప్రవీణ్, కత్రోజ్ గిరి,కూతురు శేఖర్,ప్రతాప్,రాజు, తదితరులు పాల్గొన్నారు.