కొణిజర్ల ఎస్ఐ రవి సహకారంతో రోడ్డుకు మరమ్మతులు..
వైరా, సెప్టెంబర్ (ప్రజాకలం ప్రతినిధి) గత రెండు రోజులుగా కురుస్తున్న గులాబ్ తుఫాన్ కారణంగా ధ్వంసమైన పల్లిపాడు టూ ఏన్కురు రోడ్డు ఎస్సై మాచినేని రవి చొరవతో మరమ్మత్తుకు నోచుకుంది. భారీ వర్షం కారణంగా మండలంలోని తీగలబంజర సమీపంలోని పగిడేరు ఉప్పొంగి పొర్లింది. ధీంతో వంతెనకు ఇరువైపులా మోకాళ్ళ లోతు గుంతలు ఏర్పడ్డాయి. వీటితో పాటు సమీపంలోని బ్రిక్స్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డంతా ధ్వంసమైంది. వాహనాల రాకపోకలకు తీవ్రఇబ్బంది ఎదురైంది. పరిస్థితిని గమనించిన స్థానిక ఎస్సై మాచినేని రవి స్వతహాగా ప్రొక్లైన్ సహాయం తో రోడ్డుపై లేయర్ తొలగించి గుంతలు పూడిపించారు. ఏన్కూరు ఆర్ఎండ్ బీ ఏఈ ప్రవీణ్ సహకారంతో సుమారు 12 యూనిట్ ల కంకర తోలించి రోడ్డుకు పూర్తి మరమ్మతు చేయించారు. దీంతో వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది. నిత్యం భారీ వాహనాలతో రద్దీగా ఉండే పల్లిపాడు టు ఏన్కూర్ రోడ్డు గుంతలు పడడం వెంటనే మరమ్మతుకు నోచుకోవడంతో ఎస్సై రవిని , ఏన్కూరు ఏఈ ప్రవీణ్ ను వాహనదారులు, స్థానికులు ప్రశంసించారు.